Suhana Khan : బాలీవుడ్ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్. ఈ ఇద్దరు హీరోలు కూడా వారి జెనెరేషన్స్ లో నెంబర్ 1 సూపర్ స్టార్స్. బాలీవుడ్ కి ఫేస్ లాగ ఇన్ని రోజులు ఉంటూ వచ్చారు ఈ లెజెండ్స్. అలాంటి లెజెండ్స్ వారసులు ఇండస్ట్రీ లోకి వస్తున్నారు అంటే, అభిమానుల దగ్గర నుండి, ప్రేక్షకుల వరకు ప్రతీ ఒక్కరికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది.
వాళ్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. అలాంటిది ఈ ఇద్దరు ఒకేసారి ఒకే సినిమాలో హీరో హీరోయిన్లు గా నటిస్తే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అలాగే అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ కొడుకు, అమితాబ్ మనవుడు అగస్త్య నందా ఇద్దరు కలిసి ‘ఆర్చీస్’ అనే చిత్రం లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. వీళ్ళ మధ్య స్నేహం ని చూసి మూవీ యూనిట్ కూడా ఆశ్చర్య పోయింది. అది స్నేహం లాగ అనిపించలేదు, స్నేహానికి మించి ఇంకేదో అని చెప్పాలి. రీసెంట్ గా ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన నివాసం లో దివాళీ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీ కి బాలీవుడ్ కి చెందిన ప్రముఖులందరూ హాజరు అయ్యారు. సుహానా ఖాన్ మరియు అగస్త్య కలిసి ఈ పార్టీకి వచ్చారు.
అక్కడికి వచ్చిన ప్రముఖులందరి చూపు ఈ జంటపైనే ఉంది. పార్టీలో ఉన్నంత సేపు వీళ్లిద్దరు ఎంతో క్లోజ్ గా ఉండడం అందరూ గమనించారు. వీళ్ళ మధ్య ఉన్న ఆ రిలేషన్ ని చూసి అందరికీ కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో జరుగుతుంది అనే ఫీలింగ్ వచ్చింది. మరి ఈ విషయం షారుఖ్ ఖాన్ కి తెలుసో లేదో తెలియదు కానీ, అగస్త్య తల్లి శ్వేతా కి మాత్రం బాగా తెలుసు అట. ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం ఈ క్యూట్ జంట గురించే మాట్లాడుకుంటున్నారు.