Sudigali Sudheer : ఇదేం ట్విస్ట్.. అసలు పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పిన సుధీర్.. రష్మితో రిలేషన్ ఇదేనట..

- Advertisement -

Sudigali Sudheer : బుల్లితెరపై పంచ్‌లతో అలరించి గుర్తింపు తెచ్చుకున్నారు సుడిగాలి సుధీర్‌. అలాగే వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక సుధీర్‌-రష్మి జోడికి ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ ఉన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి బుల్లితెర స్క్రిన్‌మీద కనిపిస్తే ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతారు. దీంతో ఈ జోడి వెండితెరపై ఎప్పుడు కనిపిస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. దీనికి సుధీర్‌ తాజాగా సమాధానం చెప్పారు. సుధీర్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’.

ఈ చిత్రం డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన ముచ్చటించారు. రష్మి హీరోయిన్‌గా సినిమా ఎప్పుడు చేస్తారనే దానికి సమాధానం చెబుతూ.. ‘నేను, రష్మి ఇద్దరం కథలు వింటున్నాం. మా ఇద్దరికీ కామన్‌గా నచ్చిన కథ ఇప్పటి వరకు దొరకలేదు. ఒకవేళ అలాంటిది దొరికితే కచ్చితంగా ఇద్దరం కలిసి నటిస్తాం. ఆ ప్రపోజల్ అయితే ఉంది’ అని చెప్పారు. అలాగే పెళ్లి గురించి మాట్లాడుతూ..‘నాకు అసలు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. లైఫ్లో సెటిల్ అవ్వాలి ఆ తర్వాతే చేసుకుంటాను. రష్మితో నేను అలా చేసేదంతా కేవలం ఆన్ స్క్రిన్ కే పరిమితం’ అన్నారు.

ఇక ‘కాలింగ్‌ సహస్ర’ గురించి మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో ఒక సినిమా హిట్‌ అయితే దానికి ముఖ్య కారణం కంటెంట్‌. దీనికి కూడా అదే బలం. సుధీర్‌ను దృష్టిలో పెట్టుకుని కాకుండా ఓ మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చూడాలని వెళ్తే ఈ సినిమాను కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు. ఇది నా మూడో చిత్రం. నా సినిమాలకు నిర్మాతలకు లాభాలు వస్తే చాలు. అలాగే వచ్చిన జనాలు కూడా సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడుకుంటే ఆనందిస్తా. దర్శకుడు ఏది చెబితే అదే నేను చేస్తాను. కానీ, సలహాలు సూచనలు ఏం ఇవ్వను’ అన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here