టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ క్రేజ్ ను వరల్డ్ వైడ్ ఫేమస్ చేసిన ప్రఖ్యాత డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి తో పాన్ ఇండియన్ సినిమా స్టేటస్ పెంచి.. ఆర్ఆర్ఆర్ మూవీ తో తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచి…. తన నైపుణ్యంతో ఆస్కార్ అవార్డును కూడా సాధించగలిగాడు రాజమౌళి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత క్రేజీ డైరెక్టర్గా స్టార్ డం అనుభవిస్తున్న రాజమౌళికి ఒక వింత అలవాటు ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు.రాజమౌళి బాగా పాపులర్ అయిన తర్వాత అతనికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవడానికి అభిమానులు ఆరాటపడుతున్నారు.
పలు ఇంటర్వ్యూలు మరియు ప్రోమో సందర్భాలలో రాజమౌళి గురించి అతనితో పనిచేసిన యాక్టర్స్ చాలా విషయాలు చెప్పారు. అయితే రాజమౌళి గురించి ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ ఉంది. ఈ విషయం గురించి కేవలం అతన్ని సన్నిహితులకు కుటుంబ సభ్యులకు మరియు కొంతమంది సినీ ఇండస్ట్రీ వాళ్లకు మాత్రమే తెలుసు.
ఇంతకీ ఏమిటా అలవాటు అనుకుంటున్నారా.. అది కేవలం రాజమౌళి ఒక్కడికే ఉన్న అలవాటు కాదు… ఇండస్ట్రీలో చాలామంది నటీనటులకు ఉన్న అలవాటే…అంతెందుకు మనలో కూడా చాలామందికి ఈ అలవాటు ఉంది.. అదే విపరీతమైన కోపం. రాజమౌళికి కోపం వస్తే మాత్రం తన ఎదురుగా ఎవరు ఉన్నారు అన్న ఆలోచన కూడా ఉండదట…పెద్ద ..చిన్న తేడా లేకుండా విరుచుకు పడిపోతాడట.సినిమా షూటింగ్ టైం లో ఏదన్నా సన్నివేశం సరిగ్గా రాకపోతే రాజమౌళికి మహా చెడ్డ చిరాకు వస్తుందట.
చాలా సందర్భాలలో సన్నివేశం సరిగ్గా చేయలేదు అని హీరో హీరోయిన్లపై రాజమౌళి అరవడం జరిగింది.కానీ తీరా కోపం తగ్గాక బాగా ఆలోచించి ఒకవేళ తన వైపు నుంచి ఏదైనా తప్పు ఉంది అని గ్రహిస్తే ఎవరినైతే తిట్టాడో స్వయంగా వాళ్ల దగ్గరికి వెళ్లి సారీ చెబుతారట. ఇలా రాజమౌళి కూడా విపరీతమైన కోపమనే ఒక చెత్త అలవాటుతో ఇబ్బంది పడుతున్నారు.