సంపాదించిన ఆస్తి అంతా ఒక్క సినిమాతో పోగొట్టుకున్న స్టార్‌ హీరోయిన్‌.. కారణం ఏంటంటే..!

- Advertisement -

చిన్నారి పెళ్లికూతురు అనే ప్రముఖ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అవికా గోర్. ఆ తర్వాత ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ‌, రాజుగారి గ‌ది 3, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది. తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసి డబ్బులు బాగానే సంపాదించింది అవికా గోర్‌. అయితే ఈమె సంపాదించిన డబ్బులు మొత్తాన్ని ఓ సినిమా ప్రొడక్షన్‌కి పెట్టడంతో సర్వం కోల్పోయింది.

అవికాగోర్
అవికాగోర్

హీరోయిన్లు నిర్మాణరంగంలోకి దిగడం ఇదేం కొత్త కాదు. గతంలో చాలామంది నటీమణులు ఆరంగంలో డబ్బులు పెట్టి భారీగానే నష్టపోయారు. సావిత్రి , సిల్క్ స్మిత , విజయ శాంతి వంటి స్టార్ హీరోయిన్లు ఒక పక్క నటిస్తూ, మరో పక్క నిర్మాణ రంగంలో చేతులు పెట్టి చాలావరకు నష్టపోయారు. విజయశాంతి ఆర్థికంగా తట్టుకొని నిలబడినా, సావిత్రి, సిల్క్ స్మిత తలరాతలు మారిపోయి రోడ్డున పడ్డారు. ఇప్పుడు అవికాగోర్ కూడా అదే పరిస్థితికి వచ్చేది, కానీ తెలివిగా తప్పించుకుంది.

ఈమె పలు చిత్రాల్లో కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తాన్ని ‘పాప్ కార్న్’ అనే సినిమాని నిర్మించడానికి పెట్టింది. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడమే కాకుండా, ఓటీటీ లో కూడా ఆ చిత్రాన్ని కొనుగోలు చెయ్యడానికి ఏ సంస్థ ముందుకు రాలేదు. దీంతో ఆమె పూర్తిగా నష్టపోయింది. ఆ ఒక్క సినిమాతో వచ్చిన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, తన నిర్మాణ సంస్థని మూసేసింది. ఇక నుండి పొరపాటున కూడా అటు వైపు పోకూడదని నిర్ణయించుకుంది అవికాగోర్. ప్రస్తుతం అవికాగోర్ అడపాదడపా సినిమాల్లో నటిస్తూ విజయం కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘1920 హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌’. హారర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే అవికాగోర్‌ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారిపోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here