Chiranjeevi : మెగాస్టార్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నాలుగు దశాబ్దాల నుండి నెంబర్ 1 స్థానం లో కొనసాగుతూ ఇప్పటికీ యంగ్ హీరోలకు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీని ఇస్తూ, సేవ కార్యక్రమాల్లో కూడా తనకి సాటి ఎవ్వరూ లేరు అని నిరూపించుకున్న మెగాస్టార్ చిరంజీవి కి కేంద్ర ప్రభుత్వం ‘పద్మవిభూషణ్’ అవార్డు ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

దేశం లోనే రెండవ అత్యున్నత పురస్కారాలలో ఒకటిగా పిలవబడే పద్మవిభూషణ్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి కి దక్కడం మన టాలీవుడ్ కి కూడా గర్వకారణం అంటూ సోషల్ మీడియా లో అనేక మంది సెలెబ్రిటీలు చిరంజీవి కి శుభాకాంక్షల వెల్లువ కురిపించారు. అంతే కాకుండా నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు చిరంజీవి ఇంటికి అనేక మంది సెలెబ్రిటీలు హాజరు అవుతూ ఆయనకి శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు. అయితే ఒక హీరో మాత్రం చిరంజీవి కి ఈ పురస్కారం రావడం వల్ల తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నట్టుగా తెలుస్తుంది.

తన సన్నిహితులతో ఒక మాట అంటూ ‘సొంత ఫ్లైట్ ని పట్టుకొని, పనులన్నీ మానుకొని మరీ అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడే అనుకున్నాను, చిరంజీవి కి కచ్చితంగా పద్మవిభూషణ్ అవార్డు వస్తుందని’ అని అన్నాడట. మన టాలీవుడ్ నుండి కేవలం మెగా ఫ్యామిలీ హీరోలు తప్ప ఎవరూ కూడా అయోధ్య ప్రారంభోత్సవానికి వెళ్ళలేదు అనే విషయం మనకి తెలిసిందే.

బీజేపీ పార్టీ భాగం ఇందులో ఎక్కువ ఉన్నందున, ఆ ప్రారంభోత్సవానికి వెళ్తే రాజకీయ వేడుకకు వెళ్ళినట్టే ఉంటుంది అని కొంతమంది సెలెబ్రిటీలు బహిరంగంగానే మీడియా ముందు చెప్పారు. కానీ చిరంజీవి పిలవగానే వెళ్లినందుకు కేంద్ర ప్రభుత్వం ఆయన్ని గుర్తించి ఈ పద్మ వి భూషణ్ అవార్డు ఇచ్చిందని ఆ సీనియర్ హీరో తన సన్నిహితులతో అన్నాడట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.