Sudigali Sudheer: జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనలోని అద్భుతమైన కామెడీ టైమింగ్ తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న కమెడియన్ సుడిగాలి సుధీర్.ఈయనకి ఒక స్టార్ హీరో కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా తన సొంత టాలెంట్ తో ఈ రేంజ్ కి ఎదిగాడంటే సుడిగాలి సుధీర్ హార్డ్ వర్క్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

బుల్లితెర మీద వచ్చిన క్రేజ్ తో ఈయనకి టాలీవుడ్ లో కూడా కమెడియన్ గా అవకాశాలు వచ్చాయి.అయితే సుడిగాలి సుధీర్ మిగిలిన జబర్దస్త్ కంటెస్టెంట్స్ లాగ కాదు.ఇతనికి కామెడీ తో పాటుగా అద్భుతంగా డ్యాన్స్ చెయ్యడం వచ్చు.ఫైట్స్ కూడా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో చెయ్యగలడు.ఈటీవీ నిర్వహించిన ఒక స్పెషల్ ప్రోగ్రాం లో సుడిగాలి సుధీర్ చేసిన రిస్కీ స్తంట్స్ చూసి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది.

ఇంత టాలెంట్ ని చూసిన తర్వాత ఏ డైరెక్టర్ మాత్రం సుడిగాలి సుధీర్ ని హీరో గా పెట్టి సినిమా తియ్యకుండా ఉండగలడు..?, అలా సుధీర్ కెరీర్ హీరో గా వెండితెర మీద సెకండ్ ఇన్నింగ్స్ లాగ ప్రారంభం అయ్యింది.తొలి రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి కానీ గత ఏడాది విడుదలైన మూడవ సినిమా ‘గాలోడు’ మాత్రం పెద్ద హిట్ అయ్యింది.ఇంత పెద్ద హిట్ అవుతుందని సుడిగాలి సుధీర్ మరియు మేకర్స్ కూడా ఊహించలేదు.ఈ సినిమా ఫలితం చూసిన తర్వాత సుధీర్ మీద స్టార్ డైరెక్టర్స్ కన్ను పడింది.

ఇతనిలో ఎదో విషయం ఉందని గ్రహించిన డైరెక్టర్స్ సుధీర్ తో సినిమాలు చెయ్యడానికి క్యూ కట్టేస్తున్నారు.టాలీవుడ్ లో ఎన్నో క్లాసిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన దశరధ్ త్వరలో సుధీర్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అట.దశరద్ రీసెంట్ గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ మూవీ కి స్క్రిప్ట్ రైటింగ్ విభాగం లో పని చేసాడు.తన అభిమాన హీరో లేటెస్ట్ చిత్రానికి కథని అందించిన డైరెక్టర్ తో సుధీర్ సినిమా చేస్తుండే లోపు ఆయన ఆనందానికి హద్దులే లేకుండా పోయిండట.ఈ చిత్రం లో హీరోయిన్ గా పూజిత పొన్నాడ నటిస్తుందట, త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు బయటకి రానున్నాయి.
