వెంకటేష్ కంటే నాకే ఎక్కువ క్రేజ్ ఉంది.. నా క్రేజ్ ని వాడుకోడానికి సిగ్గు లేదా అంటూ శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్

- Advertisement -

సోషల్ మీడియా లో ఒక ఆడది మాట్లాడాల్సిన మాటలు మాట్లాడి, సభ్య ఆడ సమాజం తల దించుకునేలా చేసిన మహిళ ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రీ రెడ్డి అని చెప్పడం లో ఎలాంటి అతిశయం లేదు. సాక్షి టీవీ లో ఒక న్యూస్ రిపోర్టర్ గా అప్పట్లో కెరీర్ లో ప్రారంభించిన ఈమె, ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం కోసం స్టార్ సెలెబ్రిటీలను టార్గెట్ చేసి, క్యాస్టింగ్ కౌచ్ ని అడ్డం పెట్టుకొని కొంత మంది హీరోలపై అభియోగాలు వేసింది.

శ్రీరెడ్డి
శ్రీరెడ్డి

దగ్గుపాటి అభిరామ్, న్యాచురల్ స్టార్ నాని , రకుల్ ప్రీత్ సింగ్ ఇలా ఎంతో మందితో తనకి అఫైర్స్ ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె జగన్ సపోర్టర్ ని అని చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ పై వినడానికి కూడా అసహ్యించుకునే కామెంట్స్ చేసి పాపులారిటీ ని పెంచుకుంది. రీసెంట్ గా ఈమె విక్టరీ వెంకటేష్ ని కూడా విడిచిపెట్టలేదు.

Srireddy

ఇక అసలు విషయం లోకి వెళ్తే దగ్గుపాటి అభిరామ్ హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం అవుతూ చేసిన లేటెస్ట్ చిత్రం ‘అహింస’ రీసెంట్ గానే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమా విడుదలకు ముందు చేసిన కొన్ని ప్రొమోషన్స్ లో దగ్గుపాటి అభిరామ్ గతం లో శ్రీ రెడ్డి తన పై చేసిన ఆరోపణలకు పరోక్షంగా కామెంట్స్ చేసాడు.

- Advertisement -
Srireddy Photos

దీని పై శ్రీ రెడ్డి స్పందిస్తూ ‘అరేయ్ మీ ఇంట్లో ఎంతో మంది సెలెబ్రిటీలు ఉన్నారు. మీ అన్న ఉన్నాడు, మీ నాన్న ఉన్నాడు, మీ చిన్న నాన్న వెంకటేష్ పెద్దస్టార్ హీరో, వాళ్ళ పేర్లు వాడుకోరా మీ సినిమాల ప్రొమోషన్స్ కోసం, నా పేరు ఎందుకు. చివరికి నాతో జరిపిన రంకు వేషాలను కూడా చెప్పుకొని డబ్బులు సంపాదించాలా?, ఇలా ఉన్నవేంట్రా బాబు, అంటే మీ బాబాయ్ పేరు కూడా మీ సినిమాకి ఉపయోగపడడం లేదు అన్నమాట, మీ బాబాయ్ కంటే ఎక్కువ క్రేజ్ ఉందని భావించి నా పేరు సినిమా ప్రొమోషన్స్ కోసం వాడుతున్నావా’ అంటూ శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Srireddy
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here