వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి ఎన్ని చెప్పిన, ఎంత మాట్లాడిన కూడా తక్కువే.. ఎప్పుడూ ఏదొక వార్తతో వార్తల్లో నిలుస్తూ జనాల్లో క్రేజ్ ను పెంచుకుంటుంది.. ఇక శ్రీరెడ్డి నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తుందా అని వెయిట్ చేస్తుండటం గమనార్హం.. పవన్ కళ్యాణ్ అంటే శ్రీరెడ్డి కి ఎంత కోపమో తెలిసిందే.. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ను మెగా ఫ్యామిలిని టార్గెట్ చేస్తూ బండబూతులు తిడుతూ రెచ్చిపోతుంది… అవి ఎంతగా వైరల్ అయ్యాయో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై బూతులతో రెచ్చిపోయింది.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోను చూసిన జనసైనికులు, పవన్ అభిమానులు ఓ రేంజు లో విరుచుకుపడుతున్నారు..

ఆ వీడియోలో శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ఏప్రిల్ నెలలో పవన్ ఢిల్లీ పర్యటన చేపట్టడం తెలిసిందే. ఆ సమయంలో మిత్రపక్షం బీజేపీ పార్టీ పెద్దలతో కలవడం జరిగింది.. పవన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ పర్యటనపై తాజాగా శ్రీరెడ్డి తన యూట్యూబ్ ఛానల్ లో లైవ్ పెట్టి సెటైర్లు వేసింది. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబు సీరియస్ అయ్యారని చెప్పుకొచ్చింది.. బాబు చెప్పిన స్క్రిప్ట్ ఎందుకు చెప్పలేదు అంటూ ఓ ఆట ఆడుకుంది.. తనకు అన్ని పార్టీలో మనుషులు ఉన్నారని.. పవన్ పై చంద్రబాబు మండిపడినట్లు తెలిపింది. పవన్ కళ్యాణ్ ను బుద్ది వచ్చేలా చంద్రబాబు వాతల మీద వాతలు పెడుతున్నారని.. శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది..

పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తన పరువు తీసుకునేలా చేసుకున్నాడని పేర్కొంది. పిల్ల సైనిక్స్ మధ్య కూడా పరువు పోయింది. ఆఖరికి వారాహి తుప్పుపట్టే పరిస్థితి వెళ్ళిపోయింది. దీంతో ఆ వాహనం వెనకాల పిచ్చి కుక్కలు వెంట పడతాయి అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.. ఆ వారాహి వాహనంపై నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ టీలు టిఫిన్లు అమ్ముకోవాలి.. దానికి తప్ప ఇంక దేనికి అది పనికిరాదు అని శ్రీరెడ్డి సెటైర్లు వేసింది.
వారాహి వాహనం పట్టుకెళ్ళి విజయవాడ సెంటర్ లో టీ స్టాల్ పెట్టుకోండి అని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఈసారి ఎన్నికలు కూడా నీకు రావు.. నువ్వు మళ్లీ భజన చెయ్యాల్సిందే అంటూ చెప్పలేని, రాయలేని బూతులు అనింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ఇక చెప్పడం ఎందుకు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..