Bhagawath Kesari : నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘అఖండ’ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత బాలయ్య బాబు ఆడవాళ్లు స్ట్రాంగ్ గా, ఆడపులులు లాగ ఉండడం ఎంత అవసరమో ఈ సినిమా ద్వారా చూపించాడు.

ఈ చిత్రం లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇచ్చిన మెసేజి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చింది. ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో రాకపోయినా, దసరా సెలవుల్లో ఈ సినిమా నెమ్మదిగా పుంజుకుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మూడు రోజుల్లో 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిందని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల బాలయ్య కి పెంపుడు కూతురిగా నటించిన విషయం తెలిసిందే.

అయితే కాజల్ అగర్వాల్ పేరుకి సినిమాలో హీరోయిన్ కానీ, పెద్దగా గుర్తింపు లేని పాత్ర అనే చెప్పాలి. కథ మొత్తం కీలకంగా బాలకృష్ణ మరియు శ్రీలీల మధ్యనే సాగుతుంది. రెమ్యూనరేషన్ కూడా కాజల్ అగర్వాల్ కంటే ఎక్కువగా శ్రీలీలనే తీసుకుందట. అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ ఈ సినిమాకి 90 లక్షల రూపాయిల నుండి కోటి రూపాయిల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందట.

కానీ శ్రీలీల మాత్రం కోటి 80 లక్షల రూపాయిలు అందుకుంది అట. అలా సౌత్ లో స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసి, నెంబర్ 1 హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ కంటే నిన్న గాక మొన్న వచ్చిన శ్రీలీల కి ఎక్కువ డిమాండ్ ఉండడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యింది, తదుపరి చిత్రాలకు ఆమె ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చెయ్యబోతుందో ఊహించుకోవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు.
