Sreeleela : సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం..ఎల్లపుడు మనకి అనుకూలంగా ఉండదు, అదృష్టం కలిసి వస్తే ఓవర్ నైట్ స్టార్స్ అయిపోగలరు,అలా స్టార్స్ అయినవాళ్లే ఫ్లాప్స్ కారణంగా ఫేడ్ అవుట్ కూడా అవ్వగలరు. ప్రస్తుతం హీరోయిన్ శ్రీలీల పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. పెళ్ళిసందడి చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శ్రీలీల, మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా ఆడినప్పటికీ, ఎవరీ అమ్మాయి చాలా టాలెంటెడ్ గా ఉంది అని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేసింది.
ఆ తర్వాత రవితేజ తో చేసిన ‘ధమాకా’ చిత్రం ఈ జాతకాన్నే మార్చేసింది. వరుసగా 10 సినిమాల్లో బుక్ అయిపోయింది. వాటిల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఈమె ‘ధమాకా’ తర్వాత చేసిన సినిమాల్లో ఒక్కటి కూడా కమర్షియల్ సక్సెస్ కాలేదు. ‘భగవంత్ కేసరి’ చిత్రం బాగానే ఆడింది కానీ, కమర్షియల్ గా పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు.
ఇంకా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘గుంటూరు కారం’ చిత్రం కూడా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో శ్రీలీల కెరీర్ ఇప్పుడు డైలమా లో పడిపోయింది. ఆమెతో సంతకం చేయించుకున్న నిర్మాతలు కూడా ఇప్పుడు మెల్లగా ఆమెని తమ సినిమాల నుండి తప్పించి వేరే హీరోయిన్ కోసం చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే శ్రీలీల ఇప్పుడు ఒక కన్నడ టీవీ షో కి సంబంధించి యాంకర్ గా వ్యవహరిస్తోంది.
ఇదేంటి అవకాశాలు తగ్గిపోతూ ఉండడం తో శ్రీలీల కన్నడ కి తిరిగి వెళ్లిపోయిందా? అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. కానీ అలాంటిది ఏమి లేదని, కర్ణాటక లో తన తల్లికి సంబంధించిన అత్యంత సన్నిహితురాలు ఒక టీవీ షోకి నిర్మాతగా వ్యవహరిస్తుందని, ఆమె శ్రీలీల ని ఈ షో కి హోస్ట్ గా వ్యవహరించమని కోరగా, శ్రీలీల వెంటనే ఒప్పుకొని చేస్తుందని, అంత మించి మరొకటి లేదని శ్రీలీల ఫ్యాన్స్ చెప్తున్నారు.