ఆ హీరో తో రొమాన్స్ చేస్తే ఇంట్లో నుండి గెంటేస్తాను అంటూ శ్రీలీల కి వార్నింగ్ ఇచ్చిన తల్లి..!

- Advertisement -

ఇండస్ట్రీ లోకి వచ్చిన రెండు మూడేళ్ళ లోపే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నటి శ్రీలీల. ఈమెకి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న డిమాండ్ ఏ హీరోయిన్ కి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈమె దెబ్బకి పాపం స్టార్ హీరోయిన్స్ సైతం ఫేడ్ అవుట్ అయిపోయారు. నిన్న మొన్నటి వరకు మంచి డిమాండ్ తో కొనసాగిన రష్మిక , పూజా హెగ్డే వంటి హీరోయిన్స్ జాడ కనిపించడం లేదు. ఆ రేంజ్ సునామి ని సృష్టించింది శ్రీలీల.

శ్రీలీల
శ్రీలీల

ప్రస్తుతం ఈమె చేతిలో 11 సినిమాలు ఉన్నాయి , వాటిల్లో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు సినిమాలతో పాటుగా , నితిన్ ,రామ్ వంటి యంగ్ హీరోలతో పాటు , చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాలు కూడా ఉన్నాయి. ఇలా కేవలం రెండు హిట్ సినిమాలతో ఇండస్ట్రీ ని కబ్జా చేసేసింది శ్రీలీల. బహుశా ఇలాంటి సెన్సేషన్ టాలీవుడ్ లో గత రెండు దశాబ్దాల నుండి ఎప్పుడూ చూసి ఉండమని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇకపోతే శ్రీలీల కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే ఈమె ఇండస్ట్రీ లో అడుగుపెట్టే ముందు ఆమె తల్లి స్వర్ణలత ఒక కండిషన్ పెట్టిందట. సినిమాల్లో ఎలాంటి పాత్రలు అయినా చెయ్యి, అందాలు ఆరబోయ్యల్సింది సందర్భం వస్తే వెనకాడకు, ఇండస్ట్రీ లో ఏ హీరో తో అయినా కలిసి నటించు, కానీ అక్కినేని నాగార్జున తో మాత్రం చెయ్యకు అని కండిషన్ పెట్టిందట.

- Advertisement -

ఎందుకంటే అక్కినేని నాగార్జున అంటే శ్రీలీల తల్లికి క్రష్ అట. ఇప్పటికీ నాగార్జున ని ప్రేమిస్తూనే ఉందట, అందుకే అతనితో రొమాన్స్ చెయ్యడానికి వీలు లేదని , ఒకవేళ చేస్తే ఇంట్లోకి కూడా రానివ్వను అంటూ వార్నింగ్ ఇచ్చిందట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటి వరకు శ్రీలీల కానీ, ఆమె తల్లి కానీ నాగార్జున ని కలిసినట్టు దాఖలాలు లేవు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here