Sreeleela : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీలీలకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందో తెలిసిందే. అయితే చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా టాలవుడ్ ఇండస్ట్రీని శ్రీలీల ఓ ఊపు ఊపేసింది. అయితే గుంటూరు కారం సినిమా తర్వాత హ్యూజ్ ట్రోలింగ్ కి గురైంది. ప్రజెంట్ తెలుగులో కొత్త సినిమాలేవీ ఓకే చేయలేదు. ప్రజెంట్ శ్రీలీల సైలెంట్ అయింది.
తాను చేసిని సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో మళ్లీ అవకాశాల కోసం వేట మొదలు పెట్టింది. తాజాగా రవితేజ సరసన ఛాన్స్ పట్టేసిందని తెలుస్తోంది. ఈ మూవీ కాకుండా తెలుగులో మరో ప్రాజెక్ట్ లేదనే తెలుస్తుంది. కోలీవుడ్ లో మాత్రం రెండు సినిమాలు లైన్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా స్టార్ హీరోల సరసన నటించబోతుందని టాక్. అయితే ప్రస్తుతం షూటింగ్స్ లేకపోవడంతో చేతిలో పని లేక వేసవి సెలవులు ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే బంధువుల పిల్లలతో ఆడుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. బెడ్ మీద ఇద్దరు పిల్లల మధ్య పడుకుని.. కిస్ ఇస్తూ, హగ్ చేస్తూ తెగ మురిసిపోతుంది.
ఇక ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో నెటిజన్స్ తమ కామెంట్స్ తో విజృంభించారు. ఆ ఇద్దరు పిల్లల ప్లేస్ లో మేము ఉంటే ఎంత బాగుండేదో అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. బెడ్ పై ఎలా నలిగిపోతుంది పాపం శ్రీలీల అని ఇంకొందరు బాధపడిపోతున్నారు. కాగా శ్రీలీల డ్యాన్స్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో అతిశయోక్తి కాదు. కాగా చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్స్ తన డ్యాన్స్ పై పొగడ్తల వర్షం కురిపించారు.