Uday Kiran : దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. మొదటి సినిమాతోనే హిట్ ని కొట్టారు తర్వాత వరుస సినిమాలతో దూసుకు వెళ్లిపోయారు. ఉదయ్ కిరణ్ కొన్ని సినిమాలతోనే సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఉదయ్ కిరణ్ కి ఒక్కసారిగా సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఉదయ్ కిరణ్ మరణించడంతో ఆయన మరణానికి కారణాలు ఇవేనని అనేక వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం చిరంజీవి అని, చిరంజీవి కూతురుతో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం జరిగింది పెళ్లి వరకు వెళ్లాల్సిన బంధం అక్కడితో ఆగిపోవడం వలన ఉదయ్ కిరణ్ బాధపడే ఆత్మహత్య చేసుకున్నారని ఇలా రకరకాలుగా వార్తలు వస్తూనే ఉంటాయి.
ఆయన చనిపోయి చాలా కాలం అయిన కూడా ఆయన మరణం పై వార్తలు అలా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. చిరంజీవి కారణంగానే ఇండస్ట్రీలో ఎదగకుండా చేశారని అవకాశాలు లేకుండా పోవడంతోనే ఉదయ్ కిరణ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చాలామంది ఇంకా భావిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఉదయ్ కిరణ్ నటించిన సినిమా నువ్వు నేను సినిమా రీ రిలీజైంది. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి పలు కామెంట్స్ చేశారు. యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఉదయ్ కిరణ్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటినుండి ఉదయ్ కిరణ్ చిరంజీవికి పెద్ద అభిమాని. చిరంజీవి తనకి గాడ్ ఫాదర్ అని శ్రీదేవి చెప్పారు. ఉదయ్ కిరణ్ ఒక ఈవెంట్లో చిరంజీవిని కలిశారు ఆ తర్వాత ఉదయ్ కిరణ్ ఎంతో సంతోషపడ్డారని శ్రీదేవి చెప్పారు. ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీ లోకి వచ్చాక చిరంజీవి గారు సపోర్ట్ చేశారు సినిమాలకి సంబంధించి విషయాలు చిరంజీవితో పంచుకునేవారు అని శ్రీదేవి అన్నారు. చిరంజీవి గారు చాలా సపోర్ట్ చేశారని శ్రీదేవి ఈ సందర్భంగా చెప్పారు ప్రస్తుతం ఈమె చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.