Sri Reddy తెలుగు వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి అందరికి తెలుసు.. ఎప్పుడు ఏదొక ఇష్యూతో వార్తల్లో నిలుస్తుంది..ఈమధ్య రాజకీయాలను కూడా వదలకుండా దొరికినోళ్లను దొరికినట్లు బూతుల వర్షం కురిపిస్తుంది..ఈ హాట్ బ్యూటీ గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో ఎంతలా రచ్చ చేసిందో చూశాం.. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ప్రకంపనాలు సృష్టించింది..ఇక అప్పటినుంచి చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తల దూర్చింది శ్రీ రెడ్డి.

అంతే కాకుండా తన నోటికి వచ్చిన ఘాటుగా మాటలతో అందరినీ ఆశ్చర్యపడేలా చేస్తుంది. కొందరి నటులను, రాజకీయ నాయకులను తన నోటికి వచ్చిన పచ్చి బూతులతో రచ్చ చేస్తుంది.. అలాంటి శ్రీరెడ్డి పద్ధతిగా చీరకట్టి గుడికి వెళ్లినట్లు ఉంది.. అందుకు సంబందించిన ఫోటోలు వైరల్ అవ్వడం మాత్రమే కాదు చర్చనీయాంశంగా మారాయి..ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. శ్రీరెడ్డి గుడికి సంబందించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది..

ఒక్కమాట లో చెప్పాలంటే సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంది ఈ అమ్మడు..ఇక ఈ మధ్య రాజకీయాలకు చెందిన వారిని కూడా అస్సలు వదలట్లేదు ఈ హాట్ బ్యూటీ. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పట్ల చేసే విమర్శలు అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్క విషయంలో పవన్ ను లాగుతూ ఆయన అభిమానుల నుండి తెగ విమర్శలు ఎదుర్కొంటుంది. నెట్టింట షేర్ చేస్తున్న ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే. ఇక తను వేసుకున్న బట్టలు చూస్తే నోరు వెళ్ళ పెట్టాల్సిందే. కేవలం తన ఫోటోలతోనే కాకుండా పలురకాల ట్వీట్ లతో వివాదాలు సృష్టిస్తుంది. అవి క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి.
కేవలం ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లోనే కాకుండా యూట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది. అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా షేర్ చేస్తూ వైరల్ గా మారుస్తుంది. ఇప్పటికీ చాలా వీడియోలు పంచుకోగా అది చాలా వైరల్గా మారాయి. కొన్ని వీడియోలో ఆమె మాట్లాడిన మాటలు మాత్రం బాగా పెలుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈమధ్య బాగా వంటల వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో మంచితనాన్ని సంపాదించుకుంటుంది.. తాజాగా శ్రీరెడ్డి ఓ గుడిని నిర్మించినట్లు తెలుస్తుంది..అందులో విగ్రహ ప్రతిష్ట చేస్తున్న వీడియోను షేర్ చేసింది.. శ్రీరెడ్డి ఇలాంటి పనులు కూడా చేస్తుందా అని కొందరు కామెంట్ చెయ్యగా, మరికొందరేమో నిజంగా గ్రేట్ అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది..