Sreeleela అవకాశాలకు గండి కొడుతున్న మృణాల్ ఠాకూర్.. 3 సినిమాల నుండి శ్రీలీల ని పీకేసిన నిర్మాతలు!

- Advertisement -

Sreeleela : టాలీవుడ్ లో హీరోయిన్ కెరీర్ అనేది నీటి బుడగ లాంటిది అని కొంతమంది ప్రముఖులు అంటూ ఉంటారు. ఎంత వేగంగా అయితే ఎదుగుతారో, అంతే వేగంగా ఫ్లాప్స్ పాడినప్పుడు క్రిందకి పడిపోతారు. యాక్టింగ్ టాలెంట్ ఉన్న హీరోయిన్లు మాత్రం దశాబ్దాలు కొనసాగుతుంటారు. కానీ ఎంత యాక్టింగ్ టాలెంట్ ఉన్న సక్సెస్ లేకపోతే హీరోయిన్ కెరీర్ దాదాపుగా మటాష్ అయ్యినట్టే.

Sreeleela
Sreeleela

ఇప్పుడు శ్రీలీల పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తుంది. పెళ్లి సందడి చిత్రం తో ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా శ్రీలీల, ఆ సినిమా తర్వాత ‘ధమాకా’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో టాలీవుడ్ లో వరుసగా అవకాశాలను కొల్లగొట్టింది. చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోల దగ్గర నుండి పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు వంటి స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరు ఆమె డేట్స్ కోసం ఎదురు చూసే రేంజ్ కి కేవలం రెండేళ్లలో ఎదిగింది.

Sreeleela  Photos

కానీ ధమాకా చిత్రం తర్వాత ఆమె నాలుగు సినిమాలు చేస్తే, అందులో మూడు చిత్రాలు డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఇలాంటి చెత్త స్క్రిప్ట్స్ కి శ్రీలీల ఎలా ఒప్పుకుంటుంది?, ఇలాగే పోతే ఆమె కెరీర్ కి త్వరలోనే శుభం కార్డు పడుద్ది అని చాలా మంది విశ్లేషకులు హెచ్చరించారు. వాళ్ళు హెచ్చరించినట్టుగానే శ్రీలీల తో రీసెంట్ గా అగ్రిమెంట్ చేసుకున్న ముగ్గురు టాప్ నిర్మాతలు అగ్రీమెంట్స్ ని క్యాన్సిల్ చేసుకొని అడ్వాన్స్ తిరిగి ఇవ్వమంటున్నారట.

- Advertisement -
Sreeleela Stills

వాళ్ళు ఇప్పుడు మృణాల్ ఠాకూర్ డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు ఆమె నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తుంది. రీసెంట్ గా నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ అనే సూపర్ హిట్ చిత్రం లో మృణాల్ ఠాకూర్ నటనకి ఎంత మంది పేరు వచ్చిందో మనమంతా చూసాము. భవిష్యత్తులో కూడా ఆమె ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను మాత్రమే చేస్తుందట. ఇలాగే ఆమె తన కెరీర్ ని కొనసాగిస్తే శ్రీలీల పని అవుట్ అని ట్రేడ్ లో మాట్లాడుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here