Sreeleela : ఎన్ని కోట్లు ఇచ్చినా చిరంజీవి తో సినిమా చెయ్యను అంటూ తెగేసి చెప్పిన శ్రీలీల!

- Advertisement -

Sreeleela :  నాలుగు దశాబ్దాలుగా నెంబర్ 1 హీరోగా కొనసాగి, ఇప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ విషయం లో యువ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక స్టార్ మెగాస్టార్ చిరంజీవి. అలాంటి హీరో తో సినిమా చెయ్యాలని ఏ హీరోయిన్ కి అయినా ఉంటుంది. ఆయన సినిమాలో చిన్న రోల్ వచ్చిన, ఐటెం సాంగ్ చెయ్యాల్సి వచ్చినా క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేస్తారు. హీరోయిన్ గా నేషనల్ అవార్డు ని దక్కించుకున్న తర్వాత కూడా కీర్తి సురేష్ మెగాస్టార్ కి చెల్లెలుగా నటించేందుకు ఒప్పుకుంది అంటే ఆయనకీ ఉన్న గౌరవం , స్థాయి, విలువ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే నేను చెయ్యలేను అని నిర్మొహమాటంగా చెప్పేసిందట ప్రముఖ క్రేజీ యంగ్ హీరోయిన్ శ్రీలీల.

Sreeleela
Sreeleela

పూర్తి వివరాల్లోకి వెళ్తే చిరంజీవి ప్రస్తుతం వసిష్ఠ దర్శకత్వం లో ‘విశ్వంభర’ అనే చిత్రం చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాణం జరుగుతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిష నాస్తిస్తుండగా, ‘నా సామి రంగ’ మూవీ ఫేమ్ ఆషిక రంగనాథ్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రం లో ఒక మాన్చయి ఐటెం సాంగ్ ఉంటుందట. ఈ ఐటెం సాంగ్ కోసం శ్రీలీల ని ఇటీవలే మేకర్స్ కలిశారట.

ಶ್ರೀಲೀಲಾಗೆ ಒಲಿದು ಬಂದ ಅದೃಷ್ಟ- ಮೆಗಾಸ್ಟಾರ್ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಕನ್ನಡತಿ

- Advertisement -

కానీ ఆమె మొహమాటం లేకుండా నన్ను క్షమించండి నేను చెయ్యలేను అని చెప్పి పంపేసిందట. ఇప్పట్లో ఐటెం సాంగ్స్ చేసే ఉద్దేశ్యం లేదని, ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం మంచి పాత్రలు చెయ్యాలి అనే దానిపైనే ఉందని చెప్పిందట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. శ్రీలీల కి యూత్, మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది కానీ, ఆమెకి వరుసగా ఫ్లాప్స్ మాత్రమే వస్తున్నాయి. డ్యాన్స్ పరంగా ఆమెతో పోటీ పడే హీరోయిన్ ప్రస్తుతం లేకపోయినప్పటికీ, నటనలో మాత్రం ఆమె ఇంకా పరిణీతి చెందాలి. నీకు వచ్చింది కేవలం డ్యాన్స్ కదా, ఐటెం సాంగ్ చెయ్యడానికి ఏమిటి సమస్య నీకు అంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ శ్రీలీల ని ట్యాగ్ చేసి తిడుతున్నారు.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here