Sreeleela : SSMB28 సినిమా సెట్ లో శ్రీలీల ఫొటోలు వైరల్

- Advertisement -

Sreeleela : పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది శ్రీలీల. ఈ సినిమా హిట్ కాకపోయినా శ్రీలీల బ్యూటీకి, నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో ఈ భామకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు పది సినిమాలున్నాయి. 

Sreeleela
Sreeleela

శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోయిన్. ఒక్క సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకుని వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.  ప్రస్తుతం ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ఓ సినిమాలో నటిస్తోంది. SSMB28 సినిమా షూటింగులో శ్రీలీల ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతోంది. ఈ బ్యూటీ సెట్ లో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెడ్ ఔట్ ఫిట్ లో శ్రీలీల మెస్మరైజింగ్ చేస్తోంది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

sree
sree

SSMB28 సినిమా సెట్ లో శ్రీలీల సందడి చేసింది. రెడ్ కలర్ డ్రెస్సులో శ్రీలీల ఓ లేగదూడతో ఆడుకుంటూ కనిపిస్తోంది. దూడకు గడ్డి తినిపిస్తూ ఇచ్చిన పోజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు మరోసారి మాయ చేసేందుకు శ్రీ రెడీ అవుతోందని కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -
leela

సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా శ్రీలీల స్పెషల్ సాంగ్స్ కు సై అంటోంది. ఇక లేటెస్ట్‌గా పవన్ కల్యాణ్– సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ లో వస్తోన్న సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్‌లో నటించనుందని తెలుస్తోంది.  దీనికి పెద్ద మొత్తంలో ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేయడానికి శ్రీలీల  ఏకంగా రూ.60 లక్షలు డిమాండ్ చేస్తోందట. 

ఆమెకు ఈ రేంజ్‌లో అవకాశాలు రావడానికి మాత్రం తనకు మొదటి అవకాశం ఇచ్చిన రాఘవేంద్ర రావేనట. ఈ విషయాన్ని శ్రీలీల చాలాసార్లు చెప్పుకొచ్చింది. తనకు వస్తున్న ఛాన్సుల క్రెడిట్ దర్శకేంద్రుడికేనని అంటోంది శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లో ఓ సెన్సేషన్. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here