Sreeleela బెడ్ పై పడుకుని క్యూట్ పోజులు

- Advertisement -

Sreeleela ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా బిజీగా ఉన్న హీరోయిన్. పెళ్లిసందడి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమా రిలీజ్ కంటే ముందే వరుస అవకాశాలు దక్కించుకుంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.

sreeleela
sreeleela

ఓవైపు సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో తన హవా చాటుతోంది. ఎప్పటికప్పుడు ఫొటోషూట్లు చేస్తూ ఆ ఫొటోలు అభిమానులతో షేర్ చేసుకుంటోంది. తాజాగా శ్రీలీల పోస్టు చేసిన ఫొటోలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. బెడ్ పై పడుకుని ఈ బ్యూటీ ఇచ్చిన పోజులు చాలా క్యూట్ గా ఉన్నాయి.

leela

శ్రీలీల తాజాగా పోస్టు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో శ్రీలీల బెడ్ పై పడుకుని దిండుని ముఖానికి అడ్డు పెట్టుకుని.. సగం ముఖం చూపిస్తూ.. మరో సగం ముఖం దాచేస్తూ దాగుడు మూతలు ఆడుతూ ఫొటోలకు పోజులిచ్చింది. ఈ ఫొటోల్లో శ్రీలీల చాలా క్యూట్ గా కనిపిస్తోంది. శ్రీలీల ఫొటోలు చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. శ్రీలీల చాలా అందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎంత ముద్దుగా ఉందో అంటూ హార్ట్ ఎమోజీస్ పంపిస్తూ ఇన్ బాక్స్ ను తమ ప్రేమతో నింపేస్తున్నారు. 

- Advertisement -

ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ధమాకా సినిమాతో ధమాకాదార్ హిట్ కొట్టింది. ఈ సినిమాతో ఏకంగా ఈ బ్యూటీ వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. మరోవైపు బాలకృష్ణ, రామ్ పోతినేని, మహేశ్ బాబు సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఓవైపు సీనియర్ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు యంగ్ హీరోలతోనూ జత కడుతోంది. మొత్తానికి శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అనుభవిస్తోంది. ఇలా కెరీర్ ప్రారంభంలోనే వరుస అవకాశాలు దక్కించుకుని.. వరుస హిట్లు పొందిన హీరోయిన్లు చాలా అరుదు. ప్రస్తుతం శ్రీలీల ఈ జాబితాలోనే ఉంది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here