Sreelela : డాక్టర్ తో ప్రేమలో పడ్డ శ్రీలీల.. పెళ్లి కాకుండానే అన్నీ అయ్యాయా..!

- Advertisement -

Sreelela : యంగ్ హీరోయిన్ శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆమె దాదాపు 10 నుండి 15 సినిమాలలో స్టార్ హీరోలతో కలిసి నటిస్తోంది. ఈ హీరోయిన్ దూకుడు చూస్తుంటే చాలా మంది సీనియర్ హీరోయిన్లు కూడా భయపడుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతో పాటు ఎంతోమంది సీనియర్ హీరోయిన్లను కూడా తొక్కేసి వరుస సినిమాల్లో నటిస్తోంది ఈ యంగ్ హీరోయిన్.

Sreelela
Sreelela

అయితే అలాంటి యంగ్ హీరోయిన్ గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే శ్రీలీల ప్రేమలో పడిందని అంటున్నారు. ఆమె ప్రేమలో పడింది సినిమాకి చెందిన వ్యక్తి కాదు అని తన చిన్ననాటి స్నేహితుడని సమాచారం. ఆమె ఒక డాక్టర్ తో ప్రేమాయణం నడుపుతోందని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు శ్రీలీల చిన్ననాటి ఫ్రెండ్ రాకేష్ తో ఇప్పటికీ సన్నిహితంగానే ఉంటుందట. దీంతో ఆమె రాకేష్ తో ప్రేమాయణం నడుస్తుందని అంటున్నారు. అంతేకాదు ఇటీవల ఆమె రాకేష్ ని ప్రేమించాను అన్న విషయాన్ని కూడా తన తల్లికి చెప్పిందని టాక్.

శ్రీలీల

మొదట్లో ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి ఒప్పుకోలేదుట. తర్వాత వారి ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. అలాగే శ్రీ లీల సినిమాల్లో సక్సెస్ అయిన తర్వాత రాకేష్ డాక్టర్ గా మంచి పోసిషన్ కి వెళ్ళిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని చెప్పిందట వారి తల్లి. దీంతో ప్రస్తుతం శ్రీ లీల తన సినిమాలపై ఫోకస్ పెట్టి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు విజయ్ దేవరకొండ బాలకృష్ణ రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here