Kriti Sheety : ఆ పనితో అందరినీ పడేసిన కృతిశెట్టి.. ప్రూఫ్ ఇదే..

- Advertisement -

Kriti Sheety : ఉప్పెన సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మాయ చేసింది ముంబై బ్యూటీ కృతిశెట్టి . ఈ చిత్రంలో బేబమ్మ పాత్రలో క్యూట్‌ క్యూట్‌గా మెరిసి టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది. సినిమా సినిమాకు పర్‌ఫార్మెన్స్ డోస్‌ పెంచుకుంటూ.. అదే రేంజ్‌లో ఫాలోవర్లను కూడా సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ భామ తక్కువ టైంలోనే అరుదైన మైల్‌స్టోన్‌ చేరుకుంది. కృతిశెట్టి ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 6 మిలియన్లకు చేరుకుంది.

Kriti Sheety
Kriti Sheety

తనపై అమితమైన చూపిస్తూ.. తన ప్రయాణానికి మద్దతు అందిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసింది కృతిశెట్టి. 2021లో ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి.. కేవలం రెండేళ్ల టైంలోనే 6 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుని టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ ఏడాది వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కృతిశెట్టి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది.

kriti-shetty
కృతిశెట్టి

ఇక మైమరపించే సోకులతో నెట్టింట్ల రచ్చ చేస్తోంది బ్యూటీ.. చిరునవ్వుతో ఉన్న కృతి శెట్టిని ఇలా చూస్తే కుర్రాళ్లు మాయలో మునిగిపోతారు. నెవర్ బిఫోర్ అనే విధంగా ఈ ఉప్పెన పిల్ల రచ్చ రచ్చ చేస్తోంది. వరుసగా వస్తున్న పరాజయాలకు తన అందంతో చెక్ పెట్టేందుకు మరిన్ని ఆఫర్స్ అందుకునేందుకు కృతి శెట్టి పరువాలు ఒలకబోస్తోంది. అందాల ఆరబోతతో.. సోషల్ మీడియాలో కృతి శెట్టి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిందని కొందరు అంటున్నారు. భారీ సంఖ్యంలో ఫాలోవర్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నారు. తక్కువ టైంలోనే ఈ అరుదైన మైల్‌ స్టోన్‌ ను కృతిశెట్టి చేరుకుంది. ఈ ఫాలోయింగ్ చూసి అయినా.. ముందు ముందు ఆమెకు ఆఫర్స్ వస్తాయోమో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here