Sreeleela : మహేష్ బాబు పై నోరు పారేసుకున్న శ్రీలీల.. తలపొగరు మామూలుగా లేదుగా!

- Advertisement -

Sreeleela : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. బలమైన కథ, కథనం, స్క్రీన్ ప్లే లేకుండా, చాలా ప్లైన్ స్క్రీన్ ప్లే తో త్రివిక్రమ్ సినిమాని నడిపించిన తీరు ఆడియన్స్ కి బాగా చిరాకు కలిగించింది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో తెలిసిందే.

Sreeleela
Sreeleela

ఆ అంచనాలకు ఈ సినిమా కనీస స్థాయికి చేరుకోకపోవడం వల్లే ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం అని అంటున్నారు. అలాగే సంగీత దర్శకుడు థమన్ కూడా ఈ సినిమాకి అనుకున్న రేంజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించలేదు. దాని వల్ల సన్నివేశాలు వీక్ అనిపించాయి, ఇక శ్రీలీల అయితే కేవలం డ్యాన్స్ కి మాత్రమే పరిమితం అయ్యింది.

Mahesh babu

అయితే ఈ సినిమా కలెక్షన్స్ పై సోషల్ మీడియా లో పెద్ద వివాదం నడుస్తుంది. థియేటర్స్ ఖాళీగా ఉన్నప్పటికీ ఫేక్ పోస్టర్స్, ఫేక్ కలెక్షన్స్ నిర్మాతలు చెప్పడం తో ట్రోలింగ్స్ వేరే లెవెల్ లో పడ్డాయి. అయితే ఆ పోస్టర్స్ ని చూసి ఈ సినిమా హిట్ అయ్యిందని చాలా మంది అనుకున్నారు. అలా అనుకొనే శ్రీలీల ని ఆమె స్నేహితులు ‘సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది కదా, పార్టీ ఇవ్వవా’ అని అడిగారట.

- Advertisement -
Guntur Kaaram

దానికి శ్రీలీల సమాధానం ఇస్తూ ‘పార్టీనా నా బొందనా..ఆ సినిమా అసలు ఎక్కడ హిట్ అయ్యింది’ అంటూ కామెంట్ చేసిందట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. ఒకవేళ శ్రీలీల నిజంగా ఆ మాట అని ఉంటే, ఆమెకి రాబొయ్యే రోజుల్లో సినిమా అవకాశాలు సంపాదించుకోవడంలో కష్టాలు తప్పవు. ఏమి జరగబోతుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here