Sreeleela : శ్రీలీల క్రేజ్ రోజు రోజుకూ పడిపోతూ వస్తోంది. ఎంత ఫాస్ట్ గా స్టార్ గా మారిందో అంతే దారుణంగా ప్లాప్ లు చవి చూస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు దాదాపు అన్నీ ప్లాపే అవుతున్నాయి. రెండో సినిమా అయిన స్కంద తోనే ఈ దారుణమైన ప్లాప్ లు మొదలయ్యాయి. స్కందతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దాని తర్వాత వచ్చిన భగవంత్ కేసరి కాస్త ఊరటనిచ్చిందనే చెప్పుకోవాలి. కానీ ఆ మూవీ హిట్ అయినా ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక దాని తర్వాత వచ్చిన ఎక్స్ ట్రా ఆర్టినరీ మ్యాన్ అయితే వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియలేదు.

నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా దారుణంగా ప్లాప్ అయింది. ఈ సినిమా కనీసం ఉనికిని చాటుకోలేక పోయింది. దాంతో శ్రీలీలకు మళ్లీ ప్లాప్ లు స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత రీసెంట్ గా వచ్చిన ఆది కేశవ మూవీ కూడా ఇంతే దారుణంగా ప్లాప్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయి ఎటూ కాకుండా పోయింది. సరే ఇవన్నీ ఓకేలే.. మహేశ్ బాబు మూవీ ఉంది కదా అని ఆమె ఆశలు పెట్టుకుంది. గుంటూరు కారం ఎలాగైనా పెద్ద హిట్ అవుతుంది కాబట్టి.. మళ్లీ ఛాన్సులు వస్తాయిలే అనుకుంది. కానీ ఆమె ఆశలపై నీళ్లు పడ్డాయి.

ఎందుకంటే గుంటూరు కారంకు పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు. ఆ సినిమా ప్లాప్ అనే టాక్ వస్తోంది. దాంతో శ్రీలీల ఖాతాలో వరుసగా మూడు ప్లాప్ లు పడ్డాయి. దీంతో ఆమె కథ కంచికి వెళ్లినట్లే అని అనుకుంటున్నారు. అంతే కాదు ఐరెన్ లెగ్ అంటూ ఘోరంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది. దాంతో పాటు విజయ్ దేవరకొండ సినిమాలో ఉందనే టాక్ వినిపిస్తోంది.