Sree Vishnu కొన్ని సార్లు ఎలాంటి అంచనాలు లేని సినిమాలే.. సెన్సేషన్ సృష్టిస్తాయి. అలాగే చిన్న సినిమాగా వచ్చిన శ్రీవిష్ణు సామజవరగమన
కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ నటించింది. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఫస్ట్ రన్‌లోనే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. సినిమా విడుదలైన మూడో రోజే బ్రేక్ ఈవెన్ అందుకుంది.. నాలుగో రోజు నుంచి భారీ వసూళ్లను రాబట్టుతోంది.

ఇటీవలే పది రోజుల పాటు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రూ. 7.12 కోట్ల షేర్, రూ. 13.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్ షేర్ రూ.10.37 కోట్లు, రూ. 20.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. రూ. 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. ఏకంగా రూ. 6.87 కోట్ల రేంజ్ లో లాభాలను సొంతం చేసుకుని దుమ్ము రేపింది.

అంతేకాదు ఓవర్సీస్‌లోనూ సామజవరగమన సత్తా చాటుతోంది. అక్కడ కేవలం రూ. 25 లక్షలకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కొన్నారు. కానీ సెకండ్ వీకెండ్ లోకి అడుగుపెట్టకముందే ఈ సినిమా రెండు కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. అంతేకాదు ఓవర్సీస్ లో పవన్ కళ్యాణ్ రికార్డును శ్రీవిష్ణు బ్రేక్ చేస్తున్నాడు. కరోనా పీక్ టైమ్‌లో విడుదలైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్
అప్పట్లో అమెరికాలో 7 లక్షల 80 వేల డాలర్లు రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమా సామజవరాగమనా వసూళ్లను క్రాస్ చేయబోతోంది. ఇప్పటికే శ్రీవిష్ణు సినిమా అమెరికాలో 7 లక్షల 20 వేల డాలర్లు రాబట్టింది. ఫుల్ రన్ లో 8 లక్షల డాలర్లకు పైగా రాబట్టే అవకాశం ఉందంటున్నారు.