సరికొత్త కథాంశాలతో ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని పంచుతూ టాలీవుడ్ స్థాయిని పెంచే హీరోలలో ఒకడు నిఖిల్ సిద్దార్థ్. హ్యాపీ డేస్ సినిమాతో ప్రారంభమైన నిఖిల్ సినీ కెరీర్, ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ఫ్లాప్స్ అందుకున్నప్పటికీ,’స్వామి రారా’ చిత్రం నుండి స్క్రిప్ట్ సెలక్షన్ లో తనకి తానే సాటి, ఎవ్వరూ లేరు పోటీ అని అనిపించుకునే రేంజ్ కి ఎదిగాడు నిఖిల్. గత ఏడాది ‘కార్తికేయ 2 ‘ చిత్రం తో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన నిఖిల్, ఇప్పుడు ‘స్పై’ అనే చిత్రం తో మరోసారి పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై కన్ను వేసాడు. విడుదలకు ముందు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాము.
కథ :
జయ్(నిఖిల్ సిద్దార్థ్) ఒక రా ఏజెంట్ కి సంబంధించిన వ్యక్తి. ఇండియా ని టెర్రరిస్ట్ అటాక్స్ తో హడలు పుట్టిస్తున్న ఖాదిర్ ఖాన్ ఆటలను అరికట్టించే క్రమం లో భాగంగా ఒక మిషన్ ని ప్రారంభిస్తాడు. దీనితో పాటుగా అంతకు ముందు తన అన్నయ్య సుభాష్ (ఆర్యన్ రాజేష్) ఇలాగే సీక్రెట్ మిషన్ ఆపరేట్ చేస్తున్న సమయం లో అతనిని గుర్తించి చంపేస్తారు. అలా తన అన్నయ్య ని చంపిన వాళ్ళు ఎవరో కూడా తెలుసుకునేందుకు మరో టాస్క్ ని కూడా సమాంతరం గా చేస్తుంటాడు.
ఇవి జరుగుతుండగానే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన ఒక ముఖ్యమైన ఫైల్ మిస్ అవుతుంది. దీనిని పట్టుకునే బాధ్యత కూడా జయ్ కే వస్తుంది. ఇలా ఈ మూడు టాస్కులను ఒక స్పై గా జయ్ ఎలా పూర్తి చేసాడు. ఆ పూర్తి చేసే క్రమం లో ఆయన ఎలాంటి ఇబ్బందులను ఎదురుకున్నాడు, ఎలాంటి మలుపులను చూసాడు అనేదే మిగతా స్టోరీ.
విశ్లేషణ :
ఒక మంచి పాయింట్ సరైన టేకింగ్ లేకపోవడం వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయం సాధించక చతికిల పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈరోజు విడుదలైన స్పై చిత్రం కూడా అలాంటిదే. హీరో నిఖిల్ ఎందుకు ఈ సినిమాని ఇప్పడే విడుదల చెయ్యొద్దు, రీ షూట్స్ చేసి వేరే ఎప్పుడైనా రిలీజ్ చేద్దాం అని నిర్మాత రాజశేఖర్ రెడ్డి తో గొడవలు పెట్టుకున్నాడు అనేది ఈరోజు సినిమాని చూసినవాళ్లకు అర్థం అయ్యే ఉంటుంది అనుకుంట.
ఇలాంటి కంటెంట్ ఉన్న కథకి అద్భుతమైన టేకింగ్ తోడు అయితే బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఉంటుంది. కానీ డైరెక్టర్ గర్రీ BH మాత్రం రొటీన్ టేకింగ్ తో , ఫ్లాట్ న్యారేషన్ తో ఫస్ట్ హాఫ్ కే ఆడియన్స్ కి బోర్ కొట్టించేసాడు. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మిస్సింగ్ ఫైల్ కేసు చాలా ఆసక్తి ని క్రియేట్ చేసేలా ఉంటుంది.
కానీ అదే ఫ్లో సినిమా మొత్తం ఉండదు, ఇక నిఖిల్ స్క్రిప్ట్ సెలక్షన్ కి ఎప్పటిలాగానే ఈ సినిమాకి కూడా వంక పెట్టలేము. అతను ఎంచుకున్న స్క్రిప్ట్ మంచిదే, కానీ దర్శకుడే సరైన టేకింగ్ తో తియ్యలేకపోయాడు. ఇక నిఖిల్ ఇలాంటి సినిమాల్లో నటించినదం కొత్త కాదు కాబట్టి, ఆయన యాక్టింగ్ కూడా ముందు సినిమాల లాగానే ఇందులో కూడా రొటీన్ గానే ఉంటుంది.
ఇక పాటలు కూడా పెద్దగా బాగాలేవు, హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కూడా పర్వాలేదు అనిపించింది. ఇక ఈ చిత్రం అతిధి పాత్రలో నటించిన రానా పాత్ర కూడా సినిమాకి ప్లస్ అయ్యే అమాశాలలో ఒకటి. ఈ చిత్రం చూసిన తర్వాత మనకి అనిపించే ఫీలింగ్ ఏమిటంటే, ఇదే చిత్రాన్ని వేరే డైరెక్టర్ తీసి ఉంటే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మరోసారి షేక్ అయ్యేది అని అంటున్నారు విశ్లేషకులు.
చివరి మాట :
రెగ్యులర్ స్పై చిత్రం లాగానే ఈ సినిమా కూడా ఉంది. ఈ కాన్సెప్ట్ తో అద్భుతాలు సృష్టించొచ్చు కానీ బ్యాడ్ టేకింగ్ కారణంగా యావరేజి సినిమాగానే మిగిలింది.
నటీనటులు : నిఖిల్ సిద్దార్థ్, ఐశ్వర్య మీనన్, రానా దగ్గుపాటి , జిసు సంగుప్త, ఆర్యన్ రాజేష్ తదితరులు.సంగీతం : శ్రీ చరణ్
సినిమాటోగ్రఫీ : మార్క్ డేవిడ్.
నిర్మాత : రాజశేఖర్ రెడ్డి
డైరెక్టర్ : గర్రీ BH
రేటింగ్ : 2.5/5