రీ రిలీజ్ ట్రెండ్.. వామ్మో.. 4K వెర్షన్ కోసం అంత ఖర్చు చేస్తున్నారా..?

- Advertisement -

ప్రజెంట్ టాలీవుడ్​లో ట్రెండ్ అంతా రీ రిలీజ్​లదే. సినిమా నచ్చితే సినీ ప్రేక్షకులు ఎన్నిసార్లైనా చూస్తారు. ఇక బాగా నచ్చిందంటే థియేటర్​లో కనీసం పాతిక సార్లైనా చూసేస్తుంటారు. అయితే ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ పుణ్యమా అని గతంలో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలు ఇప్పుడు బాక్సాఫీసు వద్ద మళ్లీ సందడి చేస్తున్నాయి. అప్పుడు వివిధ కారణాల వల్ల ఆ సినిమాలను థియేటర్​లో చూసే ఛాన్స్ కోల్పోయిన వారంతా ఇప్పుడు రీ రిలీజ్ చేశాక థియేటర్లకు క్యూ కడుతున్నారు. అందుకే రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆ రేంజ్​లోనే జరుగుతోంది. అయితే పాత సినిమాలు సాధారణంగా మనం ఓటీటీ, యూట్యూబ్ వంటి ప్లాట్​ఫామ్స్​లో చూసినప్పుడే కాస్త క్లారిటీ సరిగ్గా ఉండదు.

రీ రిలీజ్ ట్రెండ్
రీ రిలీజ్ ట్రెండ్

అయితే ఇక ఇప్పుడు పాత సినిమాలను థియేటర్​లో ప్రదర్శిస్తే.. చాలా వాటికి క్లారిటీ తక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఆ సినిమాలను నేరుగా రీ రిలీజ్ చేస్తే.. క్లారిటీ స్పష్టంగా లేక.. సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించరు. దీనివల్ల రీ రిలీజ్ బిజినెస్ డల్ అయిపోతుంది. అందుకే పాత సినిమాలు కూడా మంచి క్వాలిటీతో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఒకప్పుడు ‘రీళ్ల’లో సందడి చేసిన చిత్రాలను ఇప్పుడు ‘4కే'(4 k) టెక్నాలజీతో రీ రిలీజ్ చేస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతున్నారు.

- Advertisement -

ఈ మధ్య స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి చిత్రాలను రీ రిలీజ్​ చేయడం కామన్ అయిపోయింది. అవి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకోవడం కూడా కామన్ అయిపోయింది. అలా ఇప్పటి వరకు టాలీవుడ్​లో ‘బాబా’, ‘పోకిరి’, ‘జల్సా’, ‘తమ్ముడు’, ‘వర్షం’, ‘బిల్లా’, ‘చెన్నకేశవ రెడ్డి’, ‘ఆరెంజ్​​’, ‘సింహాద్రి’.. పలు చిత్రాలు ఇప్పటికే రీ రిలీజ్ అయి మంచి కలెక్షన్లను సాధిస్తూ బిజినెస్ చేశాయి. రీ రిలీజ్ బిజినెస్ ఏదో ప్రాఫిట్​ తెచ్చేలా ఉందని భావిస్తున్న నిర్మాతలు పాత సినిమాల్లో సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న మూవీస్ రీళ్లను బయటకు తీస్తున్నారు.

తాజాగా ఈ రీ రిలీజ్ బిజినెస్​పై సూపర్ స్టార్ కృష్ణ సోదరడు ఆదిశేషగిరిరావు స్పందించారు. రీ రిలీజ్ కోసం అయ్యే ఖర్చు గురించి మాట్లాడారు. ఓ నార్మల్ ఫిల్మ్​ రిజల్యూషన్​ను 4కేలో మార్చడానికి దాదాపు రూ.20లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు. ఒరిజినల్ ప్రింట్​ను తక్కువ ధరకే పొందగలిగితే.. రీరిలీజ్​ పక్కాగా మంచి లాభదాయకమైన బిజినెస్ అని అన్నారు. ఒరిజినల్ ప్రింట్​ను తక్కువ ధరకే పొందగలిగితే.. రీరిలీజ్​ పక్కాగా మంచి లభాదయకమైన బిజినెస్ అని అన్నారు.

గతంలో సినిమాలను ‘రీళ్ల’ ద్వారా చిత్రీకరించేవారు. వాటిని ఇప్పటి థియేటర్లలో ప్రదర్శించటం చాలా కష్టం. అందుకు వాటిని ఇప్పటి సాంకేతికతకు తగ్గట్టు మార్చాలి. ఈ పద్ధతిలో రీల్‌కు సంబంధించిన ప్రతి ఫ్రేమ్‌ను.. స్కాన్‌ చేసి వాటి ఇమేజ్​, వీడియో, ఆడియో క్వాలిటీని పెంచాలి. అది ఇంకా హైక్వాలిటీలో ఉండాలంటే 4k విజువల్స్‌లోకి తీసుకురావాలి. ఈ ప్రకియనే రీ మాస్టరింగ్ అంటారు. అయితే కొన్ని సినిమాల రీళ్లు అరిగిపోయి, చిగిరిపోయే అవకాశాలు ఉంటాయి.

దీంతో ఒరిజినల్‌ ఫార్మాట్‌లో చూసినా అవి స్పష్టంగా కనిపించవు. వాటిని అద్భుతంగా చూపించాలంటే.. 8k టెక్నాలజీని కూడా ఉపయోగించాలి. 4kతో పోలిస్తే దానికి రెండింతలు ఖర్చు అవుతుంది. ఇక ఆయా సినిమాల రీళ్ల పనితీరు ఆధారంగా.. రీ మాస్టరింగ్​కు రెండు నెలల నుంచి ఆరు నెలల వరకు సయయం పడుతుందట. ఇందులో స్కానింగ్‌, గ్రేడింగ్‌, రీస్టోరేషన్‌.. అనే మూడు పద్ధతులుంటాయట. ఇదంతా చూస్తుంటే రీ రిలీజ్ అంటే ఆషామాషీ ఏం కాదని అనిపిస్తోంది కదూ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here