రీ రిలీజ్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రం..బ్యాన్ చేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వార్నింగ్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని స్టార్ హీరో గా నిలబెట్టిన చిత్రం ‘తొలిప్రేమ’. అప్పటి వరకు ఆయన కేవలం చిరంజీవి తమ్ముడిగానే ఇండస్ట్రీ లో కొనసాగాడు, కానీ ఈ చిత్రం తర్వాత నుండి పవన్ కళ్యాణ్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాని ఇప్పటికీ చూసినా కొత్తగానే అనిపిస్తుంది.డైరెక్టర్ కరుణాకరణ్ ఈ చిత్రం ద్వారానే ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాకుండా, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కూడా ఆల్ టైం క్లాసిక్ హిట్ గా నిల్చిన ఈ సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, జూన్ 30 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.అప్పట్లోనే దాదాపుగా పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం , ఆరోజుల్లోనే పలుమార్లు రీ రిలీజ్ అయ్యింది. రీ రిలీజ్ లో కూడా ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది.

Tholi Prema

ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నట్టు శ్రీమాత క్రియేషన్స్ అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.అయితే ఈ సినిమాని విడుదల చెయ్యొద్దని, ఒకవేళ చేస్తే ఫ్యాన్స్ మొత్తం బ్యాన్ చేస్తామని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి ఏ చిత్రమైన రీ రిలీజ్ అయ్యినప్పుడు వాటికి వచ్చిన డబ్బులను జనసేన పార్టీ కి డొనేట్ చేస్తారు.

- Advertisement -
Tholi Prema Re Release

అంతే కానీ మూడవ పార్టీ ద్వారా విడుదల చేస్తే వాళ్ళు కచ్చితంగా జనసేన పార్టీ కి విరాళం ఇవ్వరని , ఎవరికో లాభం కలిగించడానికి మేము సిద్ధం గా లేము అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. మరి ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ మరియు మరియు ‘జల్సా’ సినిమాలు లాగా సక్సెస్ అవుతుందా, లేదా అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here