‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’, ‘సుకుమారుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు నటుడు ఆది. డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతను ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. మొదట కొన్ని రొటీన్ సినిమాలే చేసినా.. ఆ తర్వాత విలక్షణమైన కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు ఆది. తాజాగా తన భార్యతో కలిసి ఓ ప్రముఖ షోకు వెళ్లారు. వీళ్లిద్దరూ కలిసి సరదా ముచ్చట్లు పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆది భార్య అరుణ మాట్లాడుతూ.. ‘‘మా పెళ్లిచూపులు ఎయిర్‌పోర్టులో జరిగాయి. మా మామయ్యగారు (సాయికుమార్) ఏదో ఊరు వెళ్తున్నారు. అనుకోకుండా మా పేరంట్స్ కూడా అదే టైంకి హైదరాబాద్ వచ్చారు. అప్పుడు ఫోన్ చేసి ఎయిర్‌పోర్టుకు రా.. అన్నారు. నేను వెళ్లేసరికి వాళ్లంతా నా కోసం ఎదురుచూస్తున్నారు. పెళ్లిచూపులు అయ్యాక ఆది నా ఫోన్ నంబర్ అడిగితే మా నాన్నను అడిగి ఇచ్చాను’’ అని చెప్పారు. ఆది మాట్లాడుతూ..‘‘అరుణ ఎయిర్ పోర్ట్‌కు వచ్చాక ఇద్దరం పక్కకు వెళ్లి మాట్లాడుకున్నాం. నా ఫీల్డ్ గురించి చెప్పాను. సినిమా రంగంలో ఉండే ఒడుదొడుకులు చెప్పాను. అలా గంటసేపు మాట్లాడుకుంటూనే ఉన్నాం. మధ్యలో మా తల్లిదండ్రులు వచ్చి ఆపేశారు. లేదంటే ఇంకా మాట్లాడుతూనే ఉండేవాళ్లం (నవ్వుతూ). కానీ, మొదటి సారి కలిసినప్పుడే తనతో నేను కలిసి ఉండగలననే నమ్మకం కలిగింది. అందుకే అదే రోజు ఓకే చెప్పేశాను’’ అన్నారు.

అంతేకాదు వాళ్లిద్దరూ హనీమూన్ లోనే గొడవ పడ్డారని చెప్పారు. ఏదో చిన్న గొడవ అయింది. మళ్లీ గంటకే మాట్లాడుకున్నాం. పెళ్లి అయిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. మొదటి సారి అరుణని మొదటి సారి వాళ్ల సిస్టర్ పెళ్లిలో చూసినట్లు చెప్పారు. ‘‘ మా సిస్టర్ పెళ్లిలో నేను బాగా సందడి చేశాను. ఆ పెళ్లికి అరుణ వాళ్లు వచ్చారు. మొదటి సారి అప్పుడే తనని చూశాను. మా సిస్టర్ వాళ్ల మామయ్యగారికి, అరుణ వాళ్ల నాన్న ఫ్రెండ్. ఆయనే మా మామయ్యని పరిచయం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మా బావ ఫోన్ చేసి ఇలా అరుణ వాళ్లు పెళ్లి ప్రపోజల్ పెట్టారని చెప్పాడు. నాకు టైం కావాలని అడిగా. ఇంటికి వెళ్లాక ఫొటోస్ చూశాను’’ అని ఆది చెప్పారు.