Coolie : ఐమాక్స్ ఫార్మాట్ లో రజనీకాంత్ ‘కూలీ’ సినిమా.. చూసుకున్నోళ్లకు చూసుకున్నంత

- Advertisement -

Coolie : సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద స్టార్లలో ఒకరు. ఆయను కేవలం తమిళంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టైయాన్ సినిమాలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఈ అక్టోబర్‌లో థియేటర్లలో విడుదల కానుంది. అంతే కాకుండా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై అభిమానుల మదిలో క్యూరియాసిటీ నెలకొంది.

తాజాగా ఈ సినిమా పేరును నిర్మాతలు ప్రకటించారు. రజనీకాంత్ నటించిన ఈ చిత్రానికి కూలీ అని పేరు పెట్టారు. టైటిల్‌ను చూసినప్పటి నుంచి సినిమాపై అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ పెద్ద సమాచారం వెలుగులోకి వచ్చింది. తాజా మీడియా కథనాల ప్రకారం.. 50 శాతం నుండి 70 శాతం కూలీని IMAX ఫార్మాట్‌లో చిత్రీకరించనున్నారు. ఇదే నిజమైతే లోకేష్ కనగరాజ్ ఈ ఫార్మాట్‌లో చిత్రీకరించిన రెండవ చిత్రం ఇది. అయితే దీనికి సంబంధించి నిర్మాతల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కూలీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో జైలర్‌లో తన ట్యూన్స్‌తో జనాలను పిచ్చెక్కించాడు.

- Advertisement -

రజనీకాంత్ చివరిగా లాల్ సలామ్‌లో పెద్ద తెరపై కనిపించారు. ఈ చిత్రంలో అతడు అతిథి పాత్రను పోషించాడు. దీనికి ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేకపోచింది ఈ చిత్రానికి ముందు, అతను జైలర్‌లో కనిపించాడు. ఇది భాక్సాఫీసు వద్ద భారీ డబ్బులు వసూలు చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here