సౌందర్య ఇండస్ట్రీ లో మహానటి సావిత్రి తర్వాత నటిగా అంత గొప్ప పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు సౌందర్య.ఆకర్షణీయమైన ముఖ వచ్చస్సు తో పాటుగా, అద్భుతమైన నటన ఆమె సొంతం. ఏ స్టార్ హీరో తో అయిన సరే , మేడ్ ఫర్ ఈచ్ అథర్ అనిపించేంత కెమిస్ట్రీ ఈమెతోనే సాధ్యపడుతుంది. చిరంజీవి , నాగార్జున , బాలకృష్ణ, వెంకటేష్ ఇలా ప్రతీ ఒక్కరికి కూడా ఈమె కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది.

కేవలం అగ్ర హీరోలకు మాత్రమే కాదు, శ్రీకాంత్ మరియు జగపతి బాబు వంటి యంగ్ హీరోలకు కూడా సరైన జోడి అనిపించుకుంది సౌందర్య. అలా దశాబ్దానికి పైగా ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగిన ఈ మహానటి హెలికాప్టర్ ప్రమాదం లో అకాల మరణం చెందడం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పూడవలేని నష్టం అనే చెప్పాలి.

ఇది ఇలా ఉండగా సౌందర్య గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియా లో ఇప్పుడు వైరల్ అయ్యింది. అదేమిటంటే అప్పట్లో ఈమెకి ప్రముఖ నటుడు సాయి కుమార్ అంటే క్రష్ ఉండేదట, వీళ్లిద్దరు అప్పట్లో పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారట, ‘అంతపురం’ సినిమా షూటింగ్ సమయం లో వీళిద్దరి మనసులు కలిశాయని,పెళ్లి కూడా చేసుకుందామని అనుకుంటున్నారని, ఇలా ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.

ఈ విషయాన్నీ తెలుసుకున్న జగపతి బాబు, సౌందర్య కి తన మనసులో ఉన్న ప్రేమ గురించి చెప్పడం మానేశాడని అప్పట్లో ఒక రూమర్ ఉండేది. అయితే దీనిపై సాయి కుమార్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొస్తూ, ‘సౌందర్య కి నేనంటే చాలా ఇష్టం , నా ప్రవర్తన ని ఆమె బాగా అభిమానిస్తుంది, మా మధ్య ఒక అన్న చెల్లి సంబంధం మాత్రమే ఉంది,మీడియా లో వచ్చినవి నిజం కాదు’ అని క్లారిటీ ఇచ్చాడు.
