చేసింది అతి తక్కువ సినిమాలే అయినా, చిరస్థాయిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్రలను చేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళను మన చిన్నతనం లో క్రష్ గా కూడా భావించే వాళ్ళం. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు సోనాలి బింద్రే. ఈమె బాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్, అక్కడి టాప్ హీరోలందరి సరసన ఈమె హీరోయిన్ గా నటించింది. కానీ టాలీవుడ్ లో మాత్రం కేవలం 5 సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యింది.

కృష్ణ వంశీ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన ఆల్ టైం క్లాసిక్ చిత్రం ‘మురారి’ ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమైన సోనాలి బింద్రే, ఆ తర్వాత చిరంజీవి తో ‘ఇంద్ర’ మరియు ;’శంకర్ దాదా MBBS’. బాలయ్య తో ‘పల్నాటి బ్రహ్మనాయుడు’, అక్కినేని నాగార్జున తో ‘మన్మధుడు’ మరియు శ్రీకాంత్-రవితేజ-ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఖడ్గం’ వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నా సోనాలి బింద్రే, ఈ మధ్య కాలం లోనే క్యాన్సర్ ని జయించి బయటపడిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే సోనాలి బింద్రే కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది. ఈమె ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తో కలిసి ‘మన్మధుడు’ అనే చిత్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో వీళ్లిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే వీళ్లిద్దరు ప్యారిస్ కి షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు, వీళ్ళ మధ్య ఉన్న క్లోజ్ ఫ్రెండ్ షిప్ ని చూసి అప్పట్లో ఇండస్ట్రీ లో వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుంది అంటూ ప్రచారం చేశారట.

ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యిందని రీసెంట్ గా సోనాలి బింద్రే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. అక్కినేని నాగార్జున పై ఇలాంటి రూమర్స్ రావడం కొత్తేమి కాదు, అసలే ఆయన రొమాంటిక్ హీరో, హీరోయిన్స్ ని పడగొట్టే రేంజ్ లోనే ఆయన మాటలు కూడా ఉంటాయి. అందుకే ఆయన ఏ హీరోయిన్ తో పని చేసిన ఆ హీరోయిన్ తో అఫైర్స్ పెట్టేస్తుంది మన మీడియా, అలా సోనాలి బింద్రే తో కూడా నాగార్జున కి ఎఫైర్ పెట్టేసింది.
