Renu Desai : ‘బద్రి’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది రేణూ దేశాయ్ (Renu Desai). సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి సమాచారాన్ని అందిస్తుంటుంది. కొన్ని రోజుల నుంచి రేణకూ తరచూ వార్తల్లో ఉంటోంది. ఆమె పెట్టిన ప్రతి పోస్ట్ ఒక సంచలనం రేపుతుంది. తాజాగా మరో పోస్ట్ పెట్టిన రేణూ కోపంగా ఉన్న పవన్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టినట్లు అయింది.

ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని అకిరా పుట్టినరోజు సందర్భంగా మేడం మా అన్నయ్య కొడుకును దాచకండి అప్పుడప్పుడు మాకు చూపిస్తూ ఉండండి అంటూ రిక్వెస్ట్ చేశారు. దీంతో మండిపడిన రేణు దేశాయ్ మీ అన్న కొడుకు ఏంటి? అకిరా నా కొడుకు అసలు నువ్వు ఒక తల్లికి పుట్టావా అంటూ ఘాటుగా స్పందించారు. దీంతో రేణు దేశాయ్, పవన్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది.

ఇలా పవన్ అభిమానులు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ కౌంటర్ ఇస్తున్నటువంటి రేణు దేశాయ్ తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఘాటుగా విమర్శించారు.ఈ క్రమంలోనే ఒక పవన్ కళ్యాణ్ అభిమాని రేణు దేశాయ్ ని ఉద్దేశిస్తూ… పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో ఉన్నారు.ఈయన యాంటీ ఫ్యాన్స్ తన అభిమానులుగా మీకు తప్పుడు సందేశాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే మీరు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయండి అంటూ సలహా ఇచ్చారు.

ఇలా పవన్ కళ్యాణ్ అభిమాని తనకు సలహా ఇవ్వడంతో మండిపడిన రేణు దేశాయ్ (Renu Desai) అతనికి రిప్లై ఇస్తూ ఈ సమాజంతో ఇదే సమస్య.. ఎవరికోసమో నేనెందుకు మారాలి? మీరు చెప్పినట్లు జీవించడానికినేను ఏమి తప్పు చేశాను సలహా ఇవ్వడం చాలా ఈజీ ఆ బాధను భరించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది అంటూ రేణు దేశాయ్ రిప్లై ఇస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.