Sobitha Dhulipala .. ఈ తెలుగందం ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకెళ్తోంది. కోలివుడ్ లోనూ తన సత్తా చాటుతోంది. తాజాగా ఈ భామ పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రచారం కోసం ఈ బ్యూటీ సౌత్ ఇండియా అంతా చుట్టేస్తోంది. ఇందులో భాగంగా రోజుకో ఔట్ ఫిట్ లో కనిపిస్తోంది. తాజాగా ఈ భామ వైట్ కలర్ శారీలో సందడి చేసింది. ఈ చీరలో శోభిత చాలా అందంగా కనిపించింది.

వైట్ శారీలో శోభిత చాలా ముద్దుగా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజులో హెయిర్ లీవ్ చేసి చాలా కూల్ గా కనిపించింది. ట్రెడిషనల్ గా చీర కట్టినా తన లుక్ మాత్రం చాలా ట్రెండీగా కనిపించింది. ఇక చీరలో ఈ భామ ఇచ్చిన పోజులు చూసి కుర్రాళ్లు మనసు పారేసుకున్నారు. తెలుగులోనూ సూపర్ క్యూట్ అండ్ హాట్ హీరోయిన్లు ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

శోభిత చేసింది కొన్ని సినిమాలే అయినా.. చాలా సినిమాల్లో తన పాత్ర నిడివి తక్కువగా ఉన్నా.. ఈ భామ తెరపై కనిపించినంత సేపు తమకు పండుగేనంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. తెల్ల చీరలో శోభిత దేవకన్యలా కనిపిస్తోందంటూ మాట్లాడుకుంటున్నారు. ఎంతైనా తెలుగమ్మాయిల అందమే వేరంటూ లవ్ ఎమోజీస్ పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లలో శోభిత రూటే సపరేటు అంటూ ఈ భామకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

ఇక శోభిత సినిమా కెరీర్ గురించి మాట్లాడితే.. ఈ భామ అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారి సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటిస్తూ తెరపై కనిపించింది కాసేపైనా సరే.. తన నటన, అందంతో ప్రేక్షకులను మాయ చేసింది. ఇక ఈ భామ బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. రమన్ రాఘవ్ 2.0, ది బాడీ, ఘోస్ట్ స్టోరీస్ లాంటి సినిమాలతో బీ టౌన్ లో సందడి చేసింది.

శోభిత ధూళిపాళ గత కొంతకాలంగా టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ నాగచైతన్యతో డేటింగ్ లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. వీళ్లిద్దరు కలిసి విదేశాల్లో చక్కర్లు కొడుతూ ఆ ఫొటోలు కాస్త నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ రూమర్స్ నిజమేనని అభిమానులు అనుకుంటున్నారు.