ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్2’లో కనిపించి అలరించింది శోభితా ధూళిపాళ్ల. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. త్వరలోనే ‘ది నైట్ మేనేజర్ 2’తో పలకరించనుంది. అనిల్ కపూర్, ఆదిత్యరాయ్ కపూర్ నటించిన ఈ వెబ్ సిరీస్ ‘డిస్నీ+ హాట్‌స్టార్ లో జూన్ 30 నుంచి ప్రసారం కానుంది. దీని ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత.. తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంది. సినిమాల్లోకి రాకముందు ఎన్నో విమర్శలు వచ్చాయని తెలిపింది.

‘‘ఏ రంగంలోనైనా ప్రారంభం ఒక యుద్ధంలా అనిపిస్తుంది. నేను ప్రకటనల్లో నటించేటప్పుడు తెల్లగా లేనని ఎంతో మంది అన్నారు. అందంగా లేనని ఆ యాడ్‌లకు సరిపోనని నా మొహం మీదే చెప్పారు. అయినా నేను నిరాశ పడలేదు. నా దృష్టిలో అందమనేది ఎదుటి వారి ఆలోచనలకు సంబంధించిన విషయం. నా రూపాన్ని చూసి ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేశాను. దానికి బదులుగా సృజనాత్మకంగా, కొత్తగా ఉండడానికి ప్రయత్నించాను. నేను చేసే పనిపై శ్రద్ధ పెంచుకున్నాను.
అదే నన్ను ఇండస్ట్రీలో భాగమయ్యేలా చేసింది. కమర్షియల్ సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా.. వచ్చిన ప్రతి సినిమా ఆడిషన్స్‌కు వెళ్లాను. మొదటిసారి అనురాగ్ కశ్యప్‌తో కలిసి పనిచేశాను. ఆ సినిమాతో చాలా పాఠాలు నేర్చుకున్నాను. నటించాలనే తపన ఉన్నప్పుడు ఏ కష్టం కూడా బాధించదని నా అభిప్రాయం. మొదటి ఆడిషన్‌కు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒకేలా కష్టపడుతున్నాను’’ అని చెప్పింది.

శోభితా ధూళిపాళ నటుడు నాగ చైతన్యతో తన రిలేషన్ షిప్ గురించి వార్తల్లో నిలిచింది. నాగ చైతన్య-శోభిత ధూళిపాళ ఎవరికీ తెలియకుండా డేటింగ్ మరియు నైట్ డిన్నర్ కోసం దేశ విదేశాల్లో తిరుగుతున్నారని టాక్. ఇద్దరూ ఎప్పుడెప్పుడా అని హాలిడే ఎంజాయ్ చేస్తున్నారుట. నాగ చైతన్య కొత్తగా కట్టిన ఇంటికి శోభితను కూడా చాలా సార్లు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం, శోభితా ధూళిపాళ నాగ చైతన్య కొత్త ఇంట్లో కనిపించినప్పుడు, వారి పెళ్లి వార్త వైరల్ అయ్యింది. ఆ తర్వాత ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా ప్రమోషన్ సందర్భంగా నాగ చైతన్య ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నవ్వించాడు.