నాగచైతన్యకు షాక్.. వేరే హీరో అంటే చచ్చేంత ఇష్టమన్న శోభిత ధూళిపాళ

- Advertisement -

శోభిత ధూళిపాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అచ్చు తెలుగు కుటుంబంలో జన్మించిన ఈమె బాలీవుడ్లో తన కెరియర్ స్టార్ట్ చేసింది. తనదైన టాలెంటు చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. అనంతరం గూడచారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది .అయితే ఈ సినిమాతో ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది .దాని తర్వాత మేజర్ సినిమాలో మెరిసింది ఈమె. ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గర అయింది. ప్రస్తుతం బాలీవుడ్లో వర్సెస్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా ఈమె యూత్ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో సీక్రెట్ గా ప్రేమ వ్యవహారం నడుపుతోందని చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే .

Sobhita Dhulipala sun raising glamorus clicks
శోభిత ధూళిపాళ

అంతే కాదు వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఆలోచనలో కూడా ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు నాగచైతన్య మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. శోభిత సైతం నేరుగా ఈ వార్తలపై స్పందించిన దాఖలు ఇప్పటిదాకా లేదు. అయితే తాజాగా ఈమె తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఆస్క్ మీ ఎనిథింగ్ అని సెషన్ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది శోభిత .ఈ నేపథ్యంలోనే తన ఆల్టైమ్ ఫేవరెట్ హీరో ఎవరు అన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది.

Naga Chaitanya

శోభిత నటించిన తొలి సినిమా ‘రామణ్ రాఘవ్ 2.0’ విడుదలై ఇటీవల 7 ఏళ్లు పూర్తయింది. దీని గురించి మాట్లాడుతూ.. ‘నా మొదటి సినిమానే అనురాగ్‌ కశ్యప్‌ లాంటి గొప్ప దర్శకుడితో చేయడం నా అదృష్టంగా భావిస్తాను. ఆ సినిమా నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనదే. నా హృదయానికి దగ్గరగా ఉంటుంది’. అలాగే షారుక్‌ ఖాన్‌ సినిమా గురించి ఓ అభిమాని అడగ్గా.. ‘‘ఆయనకు నేను వీరాభిమానిని. ఆయన సినిమా ‘జవాన్‌’ విడుదల రోజు కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దానికి ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోకు వెళ్తాను’’ అని చెప్పింది. మిమ్మల్ని ఏదో ఓ రోజు షారుక్‌ సినిమాలో హీరోయిన్‌గా చూడాలనుందని మరో అభిమాని ట్వీట్‌ చేయగా.. శోభిత ధూళిపాళ అతడికి ధన్యవాదాలు తెలిపింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here