Naga Chaitanya – Shobhita : మరో సారి అడ్డంగా దొరికిపోయిన నాగ చైతన్య, శోభిత

- Advertisement -

Naga Chaitanya – Shobhita : హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్లు ప్రేమలో మునిగితేలి వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే చేస్తున్నారు. అయితే సమంతతో విడాకులు తర్వాత నాగచైతన్య ఎన్నడూ మాట్లాడలేదు.

కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల, ప్రమోషన్ల సమయంలో పరోక్షంగా విడాకుల పై స్పందిస్తూ వస్తోంది. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే సమంతతో విడాకుల తీసుకున్న తరువాత నాగ చైతన్య తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్ షిప్ లో ఉన్నాడనే పుకార్లు వస్తున్నాయి. తాజాగా చైతు సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోను శోభిత ధూళిపాళ లైక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే శోభిత ధూళిపాళ సైతం సరిగ్గా.. చైతు దిగిన లొకేషన్ లాంటి చోటే ఫోటో దిగడం ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తుంది.

- Advertisement -

తాజాగా మరోసారి వీరి బంధం బట్టబయలైంది. ఐయామ్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ చాయ్( Chai ), అండ్ దట్స్ ఓకే అంటూ రాసుకొచ్చింది. దానికి అర్థం ఏంటంటే.. నేనందరికీ నచ్చకపోయినా నాకేం పర్లేదు అని. సాధారణంగా ఎవరైనా టీ గురించి రాసుకు వస్తే వన్ కప్ ఆఫ్ టీ అని రాసుకొస్తారు. కానీ శోభిత మాత్రం Chai అని రాయడంతో టీ గురించి చెప్పిందా లేకపోతే పరోక్షంగా చైతు గురించి చెబుతూ ఇలాంటి పోస్ట్ చేసిందా అనే అనుమానం వస్తోంది. గతంలో నాగ చైతన్య, శోభిత లండన్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌ చెఫ్‌తో నాగ చైతన్య ఫొటో దిగారు. అయితే ఆ ఫొటోలో వెనుక శోభిత ఉంది. దీంతో వారు రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనేది ప్రస్తుతానికి రూమర్ మాత్రమే. అయితే దీనిపై స్పందించిన వీరిద్దరు తాము కేవలం ఫ్రెండ్స్ అంటూ దాటేసుకొస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sobhita (@sobhitad)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here