Sneha Reddy : సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు తమ తోటి వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే ఇండస్ట్రీతో సంబంధం లేని వారిని ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అలాంటి వారిలో అల్లు అర్జున్ ఒకరు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో కామన్ ఫ్రెండ్ ద్వారా అల్లు అర్జున్ కు స్నేహారెడ్డి పరిచయం అయ్యింది. మొదటి చూపులోనే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొంతకాలం పాటు ప్రేమించుకున్న తర్వాత ఇరువురి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు.. అయాన్, ఆర్హా. సోషల్ మీడియాలో స్నేహారెడ్డి ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. తన కూతురుతో చేస్తున్న అల్లరికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి.

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ను పాన్ ఇండియా లెవల్ కు పెంచిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. అయితే, అతడు రెట్టించిన ఉత్సాహంతో వ్యక్తిగత జీవితంలో ఇంత ఆనందంగా ఉండటానికి కారణం అతడి భార్య స్నేహారెడ్డి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ జంట అన్యోన్యత ఆనందమయ జీవన శైలి ప్రతి ఒక్కరి జీవితంలో స్ఫూర్తిని నింపుతుంది. అల్లు అర్జున్ – స్నేహారెడ్డికి పెళ్లై ఇప్పటికి 12 ఏళ్లు అవుతోంది. ఇద్దరు పిల్లలకు తల్లి అనే కానీ స్నేహారెడ్డి ఇప్పటికీ తన అందంతో టాప్ మోడల్ ని తలపిస్తుంది. సాటి హీరోల్లో షాహిద్ కపూర్ సతీమణి మీరా రాజ్ పుత్ తో స్నేహా రెడ్డి ని పోల్చి చూస్తుంటారు అభిమానులు.
స్నేహారెడ్డి వ్యక్తిగతంగా ఎంత సింపుల్ గా ఉంటారో పై ఫోటోలు చూస్తేనే అర్థం అవుతుంది. ఈ ఫోటోల్లో స్నేహా ఇలా తనకు ఇష్టమైన ఐస్ క్రీమ్ లను లాగించేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాల్లో షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. కేవలం ఐస్ క్రీమ్ లు మాత్రమే కాదు తనకు నచ్చే స్వీట్స్ కూడా ఈ ఫోటోల్లో కనిపించాయి. గతంలో సమంత హోస్టుగా వ్యవహరించిన టాక్ షో సామ్ జామ్‌లో కనిపించిన అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి ప్రత్యేకత గురించి వివరించాడు. ”స్నేహలో నాకు రెండు లక్షణాలు నచ్చుతాయి.. తను చాలా డిగ్నిఫైడ్. లైఫ్ లో చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది” అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.