Smriti Irani : కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయాల్లో ఆమె తిరుగులేని మహిళగా కొనసాగుతున్నారు.. భాజాపా నేత Smriti Irani రాజకీయాల్లోకి రాకముందు.. సినీనటిగా ఉన్నప్పుడు దాని ఎదుర్కొన్న సమస్యలను.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రామాయణ, విరుద్ధ్, హరి రిష్ట ఏ కురుక్షేత్రాలు లాంటి సీరియల్స్ లో స్మృతి ఇరానీ నటించారు. ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చిన క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ సమయంలోనే.. నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ విషయం నాకే తెలియదు. ఓ రోజు షూట్ చేస్తున్నప్పుడు నీరసంగా అనిపించింది. ఓపిక లేదని ఇంటికి వెళ్లి పోతానని అడిగాను. కానీ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల చేసేది లేక సాయంత్రం వరకు సెట్ లోనే ఉన్నాను. ఆ రోజు సాయంత్రం హాస్పిటల్ కి వెళ్ళగా అబార్షన్ అయినట్లు తెలిసింది. దాంతో చాలా బాధకి గురయ్యాను.

షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకుందామని అనుకున్నాను. కానీ అప్పటికే ఇంటి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఇంటి ఈఏంఐలు , ఇతర ఖర్చులు గుర్తుకు వచ్చి తిరిగి సెట్స్ కి వెళ్ళాను. నాకు అసలు అబార్షన్ కాలేదని అబద్ధం చెబుతున్నాను అంటూ.. ఓ వ్యక్తి నా మీద వదంతులు పుట్టించాడు. అలాంటి సమయంలో నేను చెప్పేది నిజమని నమ్మించడం కోసం రిపోర్ట్స్ తీసుకెళ్లి ఆ ప్రోగ్రాం క్రియేటర్ ఏక్తా కపూర్ కు చూపించాను.
క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ చేస్తున్నప్పుడు నా సంపాదన 1800 రూపాయలు. అప్పట్లో నా దగ్గర కారు కూడా లేదు ఇక నా భర్తకి నాకు వచ్చే జీతం మొత్తం కలుపుకుంటే 30000 రూపాయలు.. అయినా కానీ నేను రోజు సెట్స్ కి ఆటోలో వెళ్లేదాన్ని ఒక రోజు నేను ఆటోలో రావడం చూసిన నా మేకప్ మ్యాన్ నా దగ్గరికి వచ్చి.. నేను రోజు కారులో వస్తున్నా.. నువ్వు ఇలా ఆటోలో వస్తున్నావ్. సిగ్గుగా అనిపించడం లేదా.. ఏదైనా బండి కొనుక్కోవచ్చుగా అని అనేశాడు అది నాకు చాలా అవమానంగా అనిపించింది.. అని స్మృతి ఇరానీ గతంలో జరిగిన సన్నివేశాలను గుర్తు చేసుకున్నారు.