మహేశ్ బాబు గారాలపట్టి Sitara Ghattamaneni అంటే తెలుగు ప్రేక్షకులకు అభిమానం. సీతూపాప అని మహేశ్ బాబు ఫ్యాన్స్ సితారను ముద్దుగా పిలుచుకుంటారు.
సోషల్ మీడియాలో సితార చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. సితారకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు తన డ్యాన్స్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పంచుకుంటుంది.
తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా సితార లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసుకుంది. ట్రెడిషనల్ అట్టైర్ సీతూ పాప చాలా అందంగా కనిపిస్తోంది. రెడ్ అండ్ వయోలెట్ కలర్ లంగావోణీలో సితార చాలా ముద్దుగా ఉంది.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహేశ్ బాబు ఫ్యాన్స్ ఈ ఫొటోస్ చూసి సీతూ పాప చాలా ముద్దుగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.