Sitara Ghattamaneni సోషల్ మీడియా లో మహేష్ బాబు కూతురు సితార కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు, ఒక పాపులర్ స్టార్ హీరోయిన్ కి ఎంత క్రేజ్ ఉంటుందో, సితార కి కూడా అదే రేంజ్ క్రేజ్ ఉంది. ఇది కేవలం మహేష్ బాబు కూతురు అవ్వడం వల్ల వచ్చిన క్రేజ్ కాదు, తనకంటూ ఒక ప్రత్యేకమైన కంటెంట్ ఇస్తూ రప్పిచుకున్న ఫాలోయింగ్. ఈ అమ్మాయి అద్భుతంగా డ్యాన్స్ వెయ్యగలదు, వంట చెయ్యగలడు,ఇంకా పెద్దవాళ్ళు కూడా చెయ్యలేని ఎన్నో పనులు చెయ్యగలదు.

యూట్యూబ్ లో ఆమెకి ఉన్న ఛానల్ లోకి వెళ్లి చూస్తే సితార ఎంత టాలెంటెడ్ అనేది అందరికీ అర్థం అవుతుంది. రీసెంట్ గానే ఆమె తన తండ్రి మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం లోని ‘ధమ్ మసాలా బిర్యానీ’ అనే పాటకి అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో వీడియో అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ వీడియో కి మిలియన్ల కొద్దీ లైక్స్, వ్యూస్ వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సితార పేరు మీద జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ టీం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ అయ్యింది. ఎందుకంటే సితార పేరు మీద కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి , కొంతమంది ఆకతాయిలు ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ చేసుకోవచ్చని లింక్స్ పంపి డబ్బులు దోచుకుంటున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో వాళ్ళు వెంటనే ఇవంతా ఫేక్ ప్రొఫైల్స్ అని, అభిమానులు చాలా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. అంతే కాకుండా సైబర్ క్రైమ్ కేసు కూడా నమోదు చేయించారు. సోషల్ మీడియా లో ఆకతాయిలు ఇలా పాపులర్ సెలబ్రిటీస్ పేరు మీద కోట్ల రూపాయిలు దోచుకుంటున్నారు. దీనిని పోలీసులు సైతం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ విషయం లో మాత్రం నెటిజెన్స్ దే తప్పు. ముందు వెనుక ఆలోచించకుండా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయకూడదు, అప్రమత్తంగా ఉండాలి.
