సింగర్ గా రేవంత్ Singer Revanth ఎంత పాపులర్ అనేది మన అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ ఆల్బమ్స్ కి తన గాత్రం అందించి అశేష ప్రేక్షాదరణ పొందాడు.లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 6 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని ఆయన సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు.బిగ్ బాస్ ఇచ్చిన ప్రతీ టాస్కుని కసితో ఆది తనకి తానే పోటీ అనే లెవెల్ లో దూసుకెళ్లాడు.చివరికి ఫైనలిస్ట్ గా మారి టైటిల్ కూడా గెలుచుకున్నాడు.

అయితే బిగ్ బాస్ సీజన్ 6 అయిపోయిన తర్వాత అందులో పాల్గొన్న ప్రతీ కంటెస్టెంట్ స్టార్ మా ఛానల్ లో ఎదో ఒక ప్రోగ్రాం లో కనిపిస్తూనే ఉన్నారు, ఒక్క రేవంత్ తప్ప. ఏమైంది రేవంత్ కి , అందరూ కనిపిస్తున్నారు కానీ ఇతను మాత్రం కనిపించడం లేదే, ఎందుకు అజ్ఞాతం లో ఉన్నాడు అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా లో అనుకుంటున్నారు.

అయితే రేవంత్ ప్రస్తుతం తన భార్య అన్విత తో కలిసి మాల్దీవులలో మొదటి పెళ్లి వార్షికోత్సవం ని జరుపుకుంటున్నాడు. తన భార్య గర్భం దాల్చిన సమయం లో ఆమె పక్కనే ఉండాల్సిన రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు చాలా బాధపడుతూ ఉండేవాడు.అంతే కాదు పెళ్ళైన తర్వాత నా భార్య తో కలిసి సంపూర్ణంగా నెల రోజులు కూడా గడపలేదని, అప్పుడు అమెరికా టూర్ లో ఉండేవాడినని , తిరిగి వచ్చిన తర్వాత వెంటనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందంటూ హౌస్ లో ఉన్నప్పుడు కూడా చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు సంపూర్ణంగా తన భార్య మరియు పాపతో సమయం గడిపే ఉద్దేశ్యం తోనే ఆయన ఎలాంటి షోస్ లో కానీ, షూటింగ్స్ లో కానీ పాల్గొనకుండా, ఇలా ఫ్యామిలీ తో ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నాడని టాక్.కానీ రేవంత్ కి ఓట్లు వేస్తూ అతనికి ఎంతో సపోర్టుగా నిల్చిన అభిమానులు మాత్రం రేవంత్ ని బాగా మిస్ అవుతున్నారు. అయితే బిగ్ బాస్ 7 త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ప్రముఖ యాంకర్ అనసూయ బిగ్ బాస్ 7 తెలుగులో పాల్గొననున్నట్లు సమాచారం అందుతోంది.