ఎస్తేర్ నోరోన్హా అంటే చాలామందికి తెలియకపోవచ్చు.. కానీ సునీల్ హీరోగా వచ్చిన భీమవరం బుల్లోడు సినిమాలో నటించింది. తనను చూస్తే మాత్రం టక్కున గుర్తు పడతారు. బిగ్ బాస్ కంటెస్టెంట్, సింగర్, నోయల్ మాజీ భార్య అంటే అందరికీ వెంటనే గుర్తుకొస్తుంది. ఈమె హీరోయిన్ గానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పనిచేసింది. ఎస్తేర్ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ,తమిళ, కొంకణి, కన్నడ, మరాఠీ భాషల్లో కూడా నటించింది. తాజాగా # 69 సంస్కార్ కాలనీ అనే బోల్డ్ సినిమాలో నటించి ఒక్కసారిగా తన గ్లామర్ తో కుర్రకారుని పిచ్చెక్కించింది. పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉంటూ మధ్య మధ్యలో యూట్యూబ్ ఛానళ్లకి ఇంటర్వ్యూలు ఇస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది.

ఆమె నోయల్ ను పెళ్లి చేసుకున్న ఆరు నెలలకే డివోర్స్ ఇవ్వడం చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఇది ఇలా ఉంటే ఆమె ప్రస్తుతం సినీ పరిశ్రమలోకి ఓ యంగ్ హీరోతో ప్రేమాయణం సాగిస్తుందని, అదికాస్త ముదిరి సహజీవనం వరకు వెళ్లిందని తెలుస్తుంది. అంతే కాదు వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో నివాసం కూడా ఉంటున్నారని సినీ పరిశ్రమలో చర్చించుకుంటున్నారు. ఇటీవల వారిద్దరూ ఓ హోటల్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా బుక్ అవ్వడంతో మకాం ఇంటి దగ్గరే పెట్టారని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఎస్తేర్ పేరు మాత్రం సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది.