Shravana Bhargavi : మరోసారి హాట్ టాపిక్ గా హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకుల లొల్లి.. ఇంతకీ వీళ్లు విడిపోయారా? కలిసున్నారా?

- Advertisement -

Shravana Bhargavi : సినిమా ఇండస్ట్రీలో నటీనటుల ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు.. ఏదైనా ఫ్యాన్స్ కు చాలా ముఖ్యమైన విషయమే. వాళ్లు ప్రేమలో ఉన్నా చర్చే, పెళ్లి చేసుకున్నా చర్చే.. ఇక విడాకులు తీసుకుంటే మాత్రం రచ్చరచ్చే. సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్, డిస్కషన్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. అప్పటికే విడాకుల బాధలో ఉన్న వాళ్లకు ఈ ట్రోలింగ్ ఇంకాస్త హెడెక్ అని చెప్పొచ్చు. నాగచైతన్య – సమంత విడాకుల సమయంలో చూశాం కదా.. ఏ రేంజ్ లో సామ్ పై నెగిటివ్ ట్రోలింగ్, అడ్డగోలుగా రూమర్స్ వచ్చాయో.

Shravana Bhargavi
Shravana Bhargavi

ఇలాగే టాలీవుడ్ లో మరో జంట కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. అయితే చై-సామ్ లు విడిపోయారు. క్లారిటీ ఇచ్చారు. ఎవరి లైఫ్ లో వాళ్లు మూవ్ ఆన్ అయ్యారు. కానీ ఈ జంట విడాకుల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. వాళ్లే టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి. ఈ జంట 2013లో ఒకటైంది. ఓ పాట కోసం ఇద్దరూ స్టూడియోలో కలిశారు. అలా ఇద్దరూ కలిసి అరడజను వరకు కలిసి పాటలు పాడారు. ఆ సమయంలో స్నేహితులుగా మారిన వీళ్లు ప్రేమలో పడ్డారు. ఇరువైపుల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరి ప్రేమకు గుర్తుగా కూతురు (శిఖర చంద్రిక ) పుట్టింది.

అయితే గత రెండేళ్లుగా ఈ ఇద్దరు విడిపోతున్నట్లు నెట్టింట తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులకు అప్లై చేసినట్టుగా కూడా కథనాలొచ్చాయి.  కానీ ఏనాడూ ఏ వేదిక, ఏ మాధ్యమంలోనూ ఈ విషయం మీద ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ ఇద్దరూ కలిసి కనిపించడం లేదు. కనీసం సోషల్ మీడియాలోనూ ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు కనిపించవు.  దీంతో వీళ్లు విడిపోయారని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు. అయితే ఈ విషయం కొంత కాలం క్రితమే మరుగున పడిపోయింది.

- Advertisement -

Hemachandra

కానీ తాజాగా శ్రావణ భార్గవి పెట్టిన ఒక పోస్టుతో మళ్లీ ఈ జంట విడాకుల మ్యాటర్ తెరపైకి వచ్చింది. తాజాగా శ్రావణ భార్గవి తన కూతురితో కలిసి సమ్మర్ వెకేషన్‌ను ప్లాన్ చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. అయితే ఈ పోస్టు కింద నెటిజన్లు హేమ చంద్ర గురించి ఆరా తీస్తున్న కామెంట్లు కనిపించాయి. హేమ చంద్ర ఎక్కడ అక్కా.. హేమ చంద్రను మిస్ అవుతున్నాం.. మీరంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నాం అంటూ ఇలా రకరకాల కామెంట్లు ఉన్నాయి. వీళ్లిద్దరు కలిసున్నారా.. విడిపోయారో అర్థంగాక నెటిజన్లు కన్ ఫ్యూజన్ లో ఉన్నారు.

ఇక కెరీర్ పరంగా హేమచంద్ర జోష్ లో ఉన్నాడు. ఇండిపెండెంట్ ఆల్బమ్స్, మ్యూజిక్ డైరెక్షన్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చేతినిండా పనులతో బిజీగా ఉన్నాడు. మరోవైపు శ్రావణ భార్గవి పాడ్ కాస్ట్‌లతో ఫుల్ ట్రెండ్ అవుతోంది. సెలెబ్రిటీలతో శ్రావణ భార్గవి చేస్తున్న రీల్స్, పాడ్ కాస్ట్‌లు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటాయి.
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here