Singer Chinmayi గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సింగర్ గా కన్నా ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది.. ఇప్పుడు అమ్మాయిలకు ఏదైనా కష్టం వచ్చిందంటే చాలు.. అవతల ఎంత పెద్ద వారైనా సరే భయం బెణుకు లేకుండా నిలదీస్తూ వారికి తన మాటలతో చెమటలు పట్టిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మొదటి కలయికలో వచ్చే అపోహలపై బోల్డ్ కామెంట్స్ చేస్తూ దుమారం రేపింది ఈ ముద్దుగుమ్మ. వాస్తవానికి మహిళల పర్సనల్ విషయాలను సైతం ఎంతో ధైర్యంగా బహిరంగంగానే వాదిస్తూ ఉంటుంది. ఇప్పుడు తొలి కలయిక మీద ఉండే అపోహలు.. అమ్మాయిలను.. అబ్బాయిలు ట్రీట్ చేసే విధానం మీద రియాక్ట్ అయ్యి షాక్ ఇచ్చింది.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది..
కలయిక సమయంలో అమ్మాయిలకు నొప్పి ఉంటుందని.. రక్తం వస్తేనే వర్జిన్ అని.. టైట్ గా ఉంటేనే వర్జిన్ అని అంటూ ఉంటారు.. అయితే అవన్నీ కేవలం అపోహలు మాత్రమే అంటూ చిన్మయి చెప్పుకొచ్చింది. పెళ్లి కొడుకులు ఇలా ఊహిస్తారని.. కానీ రియాల్టీలో ఇలా ఉండదని.. ఇటీవల వచ్చిన ట్రోల్స్ పై మండిపడింది.. వెజీనా టైట్ గా ఉంటేనే.. రక్తం కారితేనే.. నొప్పి వస్తేనే.. వర్జిన్ అని అపోహ పడుతుంటారు. కానీ అవన్నీ అబద్ధాలు.. నిజానికి తొలి కలయిక సమయంలో అమ్మాయిలకు మరింత బాధ నొప్పి అంటే అది వైద్య పరంగా పెద్ద సమస్య .. వెంటనే చికిత్స తీసుకోవాలి అని కూడా ఈమె చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతుంది..
అంతేకాదు తొలి కలయిక సమయంలో మరీ టైట్ గా ఉండి.. నొప్పి వస్తే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని నొక్కి మరీ చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి విషయాలను బయట డిస్కస్ చేయడానికి అసలు సిగ్గు పడవద్దు అని, కానీ ఇప్పటి సమాజం అలాగే వ్యవహరిస్తోంది.. జనరేషన్ మారుతున్నా.. అపోహలు మాత్రం మారట్లేదు.. ఒకవేళ ఇలాంటి విషయాలు బయటకు చెప్పాలని కొంతమంది అనుకున్నా.. ఇలాంటివి ఎవరైనా బయట మాట్లాడతారా? అని మనల్ని తక్కువ చేసి చూస్తారని చిన్మయి చెప్పడం గమనార్హం.. అబ్బాయిలు వేసే ట్రోల్స్ కు కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట ఓ రేంజులో దుమారం రేపుతుంది..