శృతి హాసన్.. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. తన బాయ్ ఫ్రెండ్ తో ప్రేమలో మునిగి తెలుతుంది.. డూడుల్ ఆర్టిస్టు శాంతను హజారికతో శృతి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.. వీరిద్దరికి సంబందించిన ఫోటోలను కూడా శృతి హాసన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. శృతి హాసన్, ప్రియుడు శాంతనుతో కలిసి ఎయిర్‌పోర్ట్ లో కెమెరాలకు చిక్కింది… ఇద్దరు కలిసి ఎయిర్ పోర్ట్ కి వెళ్తున్నారు. ఇందులో ఇద్దరూ బ్లాక్ డ్రెస్‌లో ఉండటం విశేషం.. ఈ సందర్బంగా శృతి తన బాయ్ ఫ్రెండ్ ను హగ్ కిస్ లతో ముంచేసింది.. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

అయితే ఇందులో ఈ ఇద్దరు పబ్లిక్‌లో రెచ్చిపోయారు. ఎయిర్‌పోర్ట్ వద్ద హగ్గులిచ్చుకుంటూ రచ్చ చేశారు. ప్రియుడిని గట్టిగా కౌగిలించుకుంది శృతి. ఆయా పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. గతంలో కూడా చాలా సార్లు శృతి పబ్లిక్ లోనే అలా చేసింది.. కరోనా లాక్ డౌన్ సమయం నుంచే ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఆ సమయంలో చాలా వరకు కలిసే ఉన్నారు. దీంతో ఇద్దరి మధ్య అనుబంధం మరింతగా పెరిగింది..అప్పటినుంచి వీరిద్దరూ కలిసే ఉన్నారు.. ఒకరకంగా చెప్పాలంటే లివింగ్ రిలేషన్ లో ఉన్నారు..ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్లడం, కలిసే తిరగడం చేస్తున్నారు.
ఇంట్లోనూ ప్రియుడి ఒళ్లో పడుకుని సేద తీరుతూ, చిలిపి పోజులతోనూ అలరిస్తుంటుంది శృతి హాసన్.. ఇక శృతి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది..ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్
చిత్రంలో నటిస్తుంది..దీంతోపాటు నానితోనూ కలిసి నటిస్తుంది. నాని30
లో శృతి ఎంపికైన విషయం తెలిసిందే.. ఈ ఏడాదిలోనే ఈ సినిమాలు విడుదల కానున్నాయి.. ఇంకా కొన్ని సినిమాలకు సైన్ చేసింది.. వాటి గురించి తెలియాల్సి ఉంది..