బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ మీదుంది అగ్ర కథానాయిక శ్రుతి హాసన్. ఈ ఏడాది నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ చిత్రంలో నటిస్తుంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాల్లో ఇదే భారీ బడ్జెట్ పాన్ చిత్రం కావడం విశేషం. యంగ్ హీరోల సరసన సినిమాలు చేయాల్సిన టైమ్‌లో 60 ప్లస్ హీరోల సినిమాలకు ఎందుకు స్టెప్పులేస్తున్నట్టు..? అని పెద్ద చర్చే నడిచింది. అయితే, ఇలాంటి విషయాలను పట్టించుకోనని ఆ మధ్య చెప్పేశారు శ్రుతిహాసన్ అయితే వెండితెరపైనే కాకుండా.. నిజజీవితంలో శ్రుతి హాసన్ కాస్త విభిన్నం.

గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి నిత్యం శ్రమిస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రోజూ రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఓప్పుడు లవ్ ఎఫైర్లకు కేరాఫ్ అడ్రెస్ గా ఉండేది శ్రుతి హాసన్. ముఖ్యంగా కెరీర్ ఆరంభంలో చాలా మందికి హీరోలతో శృతి హాసన్ ఎఫైర్లు నడిపించిందని వార్తలు వచ్చాయి. అలాంటి శృతి తొలిసారి ప్రేమలో ఎప్పుడు పడిందో తెలిస్తే నిజంగానే షాకైపోతారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ తన ఫస్ట్ లవ్ గురించి సీక్రెట్ లీక్ చేసింది.

మై లైఫ్ మై రూల్స్ అన్నట్లు వ్యవహరించే ఈ బ్యూటీ.. 15 ఏళ్లకే ప్రేమలో పడింది. టీనేజ్‌లోనే తనతో పాటు చదివే ఒక అబ్బాయిని ఎంతగానో ఇష్టపడిందట. ఫీలింగ్స్ ఆపుకోలేక అతడికి ప్రపోజ్ కూడా చేసిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అయితే ఫస్ట్ లవ్ ఎప్పుడూ లైఫ్‌లో స్వీట్ మెమోరీగానే ఉంటుందని.. తన విషయంలోనూ అదే జరిగిందని శృతి పేర్కొంది.