Shruti Haasan : ఫ్లాప్ హీరోలకు అదృష్ట దేవతగా స్టార్ హీరోయిన్.. ఎంతమంది హీరోలకు హిట్ ఇచ్చిందంటే..?

- Advertisement -

Shruti Haasan : టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి అంచెలంచెలుగా క్రేజ్‌ని రెట్టింపు చేసుకుంటున్న స్టార్ హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు. గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యతనిస్తూ ఫ్లాప్ హీరోల ఒడిలో లక్కీ బ్యూటీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. చాలా మంది స్టార్ హీరోలు నిరాశలో ఉన్న సమయంలో హిట్ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చిందని ఆమె అభిమానులు అభిప్రాయపడ్డారు. గబ్బర్ సింగ్ సినిమాకు ముందు పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొన్నాడు. అయితే శృతిహాసన్ గబ్బర్ సింగ్ సినిమాలో జోడీ కట్టాక ఆయన మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. వకీల్ సాబ్ ముందు కూడా వరుస ఫ్లాప్ లను ఎదుర్కొన్నాడు పవన్ కళ్యాణ్.

Shruti Haasan
Shruti Haasan

దాంట్లో కూడా శృతి హాసన్ నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలానే మాస్ మహారాజ్ రవితేజ వరుస ఫ్లాపుల్లో కూరుకుపోయిన సమయంలో బలుపు సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చినప్పటికీ రవితేజకు మళ్లీ వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రుతిహాసన్‌తో మళ్లీ జత కట్టి క్రాక్‌ సినిమా చేశాడు. ఈ సినిమా ఏ రేంజ్‌లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరితో పాటు శ్రీమంతుడు సినిమాతో మహేష్ బాబుకు హిట్ ఇచ్చింది శ్రుతి హాసన్. సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొంటోంది.

Srimanthudu

ఇటీవల పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస ఫ్లాపులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌కి ఊహించని రేంజ్‌లో సక్సెస్‌ రాలేదు. ఆది పురుష్, రాధే శ్యామ్ వంటి వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న ప్రభాస్.. సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ ఏడాది చిరు నటించిన ఆచార్య, గాడ్‌ఫాదర్‌ సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. అలాగే చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో తమ అభిమాన స్టార్ హీరోలకు హిట్స్ ఇచ్చిన శృతి హాసన్ ను లక్కీ హీరోయిన్ అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here