అక్కినేని అఖిల్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న శ్రీయా భూపాల్ ఇప్పుడు ఎక్కడ ఉందో..ఏమి చేస్తుందో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

- Advertisement -

అక్కినేని నాగార్జున నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్ కి ఎంత మంచి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అందం మరియు టాలెంట్ ఉన్నప్పటికీ కూడా సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడం తో ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్’ సినిమా కూడా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో అభిమానులు బాగా డీలా పడ్డారు.

అక్కినేని అఖిల్
అక్కినేని అఖిల్

కనీసం పెళ్ళైన చేసుకుంటే ఆ విషయం లో అయినా మన హీరో ఒక ఇంటి వాడు అయ్యాడు కదా అని ఆనందిద్దాం అనుకుంటే అది కూడా ఇప్పటి వరకు జరగలేదు. 2016 వ సంవత్సరం లో సమంత మరియు నాగ చైతన్య తో పాటుగా అఖిల్ మరియు శ్రీయా భూపాల్ నిశ్చితార్థం కూడా జరిగింది. వీళ్లిద్దరు చాలా కాలం నుండి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు.

అయితే రెండు కుటుంబాల మధ్య విబేధాలు రావడం తో పెళ్లి పెటాకులు అయ్యింది. అప్పటి నుండి అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఇంకా కొనసాగుతున్నాడు. ఇక శ్రీయా భూపాల్ విషయానికి వస్తే ఈమె టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ కి కూతురు. ఆస్తి పాస్తులకు ఏమాత్రం కొదవలేని కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. తారలు కూర్చొని తిన్నా తరిగిపోని ఆస్తి ఆమె సొంతం. అయితే ఈమెకి అమెరికా లో బోలెడన్ని వ్యాపారాలు ఉన్నాయి అట.

- Advertisement -

గత కొద్దీ సంవత్సరాల నుండి ఆమె అక్కడే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఈమె కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదట. కెరీర్ లో కొన్ని గోల్స్ ని పెట్టుకుందని, అవి చేరుకునే వరకు అసలు పెళ్లి ప్రస్తావనే వద్దని ఇంట్లో వాళ్లకి కూడా చెప్పిందట. చూసేందుకు అచ్చం సినిమా హీరోయిన్ లాగ ఉన్న ఈమె సోషల్ మీడియా లో కూడా ఎక్కడా అందుబాటులో లేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here