Shraddha Das : బుల్లితెరపై రకరకాల షోలు దర్శనం ఇస్తున్నాయి.. కొన్ని కామెడీ పేరుతో పచ్చి బూతులను జనాలను ఆకట్టుకుంటున్నారు.. కొన్ని షోలు విమర్శలు అందుకున్న మరికొన్ని షోలు మాత్రం క్రేజ్ ను అందుకున్నాయి.. ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ మిగతా అందరూ అతడి మీద పడిపోతు కౌంటర్లు వేస్తుంటారు.. ఒకప్పుడు సుధీర్ మీద అందరూ కౌంటర్లు వేస్తుండేవారు. ఢీ షోలో అయితే ఆది, ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఇలా అందరూ కూడా దారుణంగా సెటైర్లు వేస్తుంటారు. ఇప్పుడు Shraddha Das కూడా హద్దులు దాటుతున్నట్టుగా కనిపిస్తోంది..

తాజాగా రిలీజ్ చేసిన ఢీ ప్రోమో వైరల్ అవుతోంది. ఢీ షోలో బిగ్ బాస్ ఫేమ్ అఖిల్‌ను ఎంతలా ఆడుకున్నారో అందరికీ తెలిసిందే. అఖిల్‌కు అలా మాటలు పడటం అవసరమా? అని అంతా అనుకున్నారు. ఇప్పుడు జెస్సీ పరిస్థితి కూడా అలానే తయారైంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అయితే ఆది కనిపించడం లేదు. ఈ ఎపిసోడ్‌కు ఆది డుమ్మా కొట్టేశాడేమో.

ఇక ఈ ప్రోమోలో అందరూ కలిసి జెస్సీ పరువుతీశారు.. జెస్సిని బకరాను చేశారు..ఆఖరికి శేఖర్ మాస్టర్ అయితే.. ముందు నీలో వేడి ఉండాలి కదా? అని అనేసి పరువుతీశాడు. మా ఇంట్లోకి సడెన్‌గా రాకండి.. సీన్ చూసి తట్టుకోలేరు అని జెస్సీ అంటే.. ఏ సీన్ ఉంటుందో మాకు తెలుసు..

ఒక్కొక్కరు ఒక్కోలా అంటారు.. ఇక ఆరుగురు పతివ్రతలు సినిమాలో ఒకాయన ఇలా మూలకు కూర్చుని ఏడుస్తుంటాడు తెలుసా? ఆ సీన్ కదా? అని ప్రదీప్ దారుణంగా పరువుతీస్తాడు. నీ గురించి నాకు తెలుసు అని శ్రద్దా దాస్ అంటుంది. తన పరువేదో కాపాడుతుందని జెస్సీ అనుకుంటాడు. కానీ మరింత దారుణంగా పరువుతీస్తుంది. నువ్ పూజకు పనికి రాని పువ్వు అని అందరి ముందు అనేస్తుంది. దీంతో జెస్సీ తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక సతమతం అవుతాడు.. మొత్తానికి షో హైలెట్ అయ్యింది.. కామెడితో నవ్వులు పూయించింది.. ఈ ఎపిసోడ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ ప్రోమోను చూడండి..