Shraddha das కాక్‌టెయిల్ పార్టీలో టాలీవుడ్ బ్యూటీ రచ్చ

- Advertisement -

Shraddha das టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో తనదైన హవా చూపిస్తోంది. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ఫ్యాన్స్ కు కిక్కిస్తోంది. అందాల ఆరబోతలో తనకు సాటి ఎవరూ లేరంటూ.. తనకెవరూ పోటీ రారంటూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. బోల్డ్ ఔట్ ఫిట్స్ లో.. ఘాటు పోజులిస్తూ కుర్రాళ్లకు కైపెక్కిస్తోంది.

Shraddha das
Shraddha das

సినిమా అవకాశాలేం లేని శ్రద్ధా ప్రస్తుతం తన ఫోకస్ అంతా బుల్లితెరపైనే పెట్టింది. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే వీలైనంత బోల్డ్ ఔట్ ఫిట్స్ లో అలరిస్తూ.. అటు బుల్లితెర ప్రేక్షకులను.. ఇటు సినిమా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

shrada

సినిమా ఛాన్సులు లేకపోవడంతో ఈ భామ అందాల ప్రదర్శన అంతా సోషల్ మీడియాలోనే చూపిస్తోంది. ఓవైపు బుల్లితెరపై షోస్ చేస్తూ.. మరోవైపు వెకేషన్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ భామ ఓ పబ్ కు వెళ్లి తన స్నేహితులతో కలిసి రచ్చ చేసింది. ఈ రచ్చకు సంబంధించిన ఫొటోలు తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

- Advertisement -
shraddha

శ్రద్ధా ఈ ఫొటోల్లో చాక్లెట్ కలర్ క్రాప్ టాప్, బ్లాక్ జీన్స్ వేసుకుని కనిపించింది.  తన ఎద అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ ఆ పార్టీలో డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేసింది. మరోవైపు డ్రింక్స్ సిప్ చేస్తూ కుర్రాళ్లకు కైపెక్కించింది. స్పైసీ స్టఫ్ తింటూ శ్రద్ధ షేర్ చేసిన ఫొటోలు చూసిన కుర్రాళ్లు స్టఫ్ కంటే శ్రద్ధాయే హాట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

das

సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా ఆ తర్వాత అల్లు అర్జున్ తో కలిసి నటించిన ఆర్య2 సినిమాతో ఫేమస్ అయింది. ఆ మూవీలో శాంతి క్యారెక్టర్ ను కుర్రాళ్లు ఇప్పటికీ మరిచిపోలేదు. అంతగా ఆకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమాలో నిషా క్యారెక్టర్ లోనూ అదరగొట్టింది. ఈ సినిమాల తర్వాత శ్రద్ధాకు పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఈ భామ బుల్లితెరపై డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here