Rajamouli : మ‌హేష్ బాబుకు అమెరికాలో మూడ్నెళ్లు చుక్కలు చూపించబోతున్న రాజమౌళి.. మామూలుగా కాదు

- Advertisement -

Rajamouli తో సినిమా అంటే ఎంతటి స్టార్ హీరో అయినా ఆయన హ్యండ్ ఓవర్లో ఉండాల్సిందే.. ఆయనతో వర్కంటే ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాలో ఇప్పటికే చేసిన ప్రభాస్..రానా..రామ్ చరణ్..తారక్ లకు బాగా తెలుసు. సినిమా అయ్యేంతవరకు అతనితో పాటు ట్రావెల్ చేయాలన్నది రూల్.. ఇది సినిమా ప్రారంభం ముందే టెర్మ్స్ అండ్ కండీషన్స్ లో తప్పక ఉంటుంది. రాజమౌళి సెట్ లో ఉన్నంత సేపు అతని అండర్ లో ఉండాలి.

Rajamouli
Rajamouli

అతనేం చెబితే అదే చేయాలి. అవసరం మేరకు వర్క్ షాప్స్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిందే. ఇంకా అవసరమైతే విదేశాలు వెళ్లి అక్కడ ట్రైనర్ల చేత శిక్షణ పొంది రావాల్సి ఉంటుంది. ఇలాంటివి సవాలక్ష ఉంటాయి. రాజమౌళి పాన్ ఇండియా సినిమాలు చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏ హీరో అయినా రెండేళ్లు అతని సినిమాకి కేటాయించాల్సిందే. వచ్చే ఏడాది నుంచి మహేష్-రాజమౌళి సినిమా స్టార్ట్ కాబోతుంది.

ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ అని.. ఇది కూడా రెండు భాగాలుగా రాబోతున్నట్లు ఇటీవలే రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. ఇప్పటివరకూ ఒక భాగంగానే అనుకున్నారు కానీ ఈ కథని ఒక్క భాగంలో చెప్పడం సాధ్యపడదని.. అలా చేస్తే కథకు పూర్తి న్యాయం జరగదని బాహుబలి తరహాలో రెండ భాగాలుగా ఎస్ ఎస్ ఎంబీ 29ని ప్రకటించారు. ఆ లెక్కన చూస్తే మహేష్ ఈ సినిమా కోసం నాలుగైదేళ్లు తన డేట్స్ కేటాయించాల్సిందే. 2024 లో మొదలు పెడితే 2028 వరకూ మహేష్ మరే దర్శకుడికి డేట్లు కేటాయించే పరిస్థితి ఉండదు. ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి.

- Advertisement -

అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం తెర‌పైకి వ‌చ్చింది. మ‌హేష్ బాబుకు ఓ మూడు నెల‌ల పాటు రాజ‌మౌళి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇప్పించ‌బోతున్నాడ‌ట‌. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ఇండియాలో కాకుండా ఆమెరికాలో ప్లాన్ చేస్తున్నార‌ట‌. సినిమా ప‌ట్టాలెక్క‌క‌ముందే మ‌హేష్ బాబుకు రాజ‌మౌళి చుక్క‌లు చూపించ‌బోతున్నాడ‌ని.. డిసెంబ‌ర్ లో ఆయ‌న ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో రాజ‌మౌళితో అంత వీజీ కాదు.. మ‌హేష్ కు టార్చ‌ర్ స్టార్ట్ కాబోతోంది అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం మూవీతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here